telugu navyamedia
ఆరోగ్యం

ఉదయం పరగడుపున మజ్జిగ త్రాగితే కలిగే ప్రయోజనాలు

curd

కడుపులో మంట, అసిడిటీ, గ్యాస్, అల్సర్ సమస్యలు ఉన్నవారు ఉదయం పరగడుపున మజ్జిగ త్రాగితే ఆ సమస్యలు తొందరగా తగ్గిపోతాయి. మజ్జిగలో ఉన్న పోషకాలు మన శరీరానికి అన్ని రకాలుగా సహాయపడతాయి. మజ్జిగ త్రాగటం వలన జీర్ణాశయం, పేగులలో ఉండే హానికర బ్యాక్టీరియా నశించి మంచి బ్యాక్టీరియా వృద్ధి చెంది జీర్ణాశయ సమస్యలు రాకుండా కాపాడుతుంది. అంతేకాక మలబద్దకం,అజీర్ణం,గ్యాస్ సమస్యలు తగ్గిపోతాయి.వయస్సు రీత్యా వచ్చే మలబద్దకం సమస్యకు మంచి పరిష్కారం అని చెప్పవచ్చు.మజ్జిగలో అర స్పూన్ మిరియాల పొడి,మూడు కరివేపాకులు వేసుకొని త్రాగితే రక్తంలో చక్కర స్థాయిలు తగ్గటమే కాకుండా శరీరంలో అధికంగా పేరుకుపోయిన కొవ్వు కూడా కరిగిపోతుంది. మజ్జిగలో అరస్పూన్ అల్లం రసం కలుపుకొని త్రాగితే విరేచనాలు తగ్గుతాయి. అంతేకాక ఎండాకాలంలో వచ్చే డీ హైడ్రేషన్ సమస్య కూడా తగ్గిపోతుంది. రక్తపోటు సమస్య ఉన్నవారు ప్రతి రోజు ఉదయం ఉప్పు లేకుండా మజ్జిగ త్రాగితే రక్తపోటు అదుపులో ఉంటుంది. రక్తపోటు ఉన్నవారు మాత్రమే ఉప్పు మజ్జిగలో వేసుకోకూడదు. మిగతావారు మజ్జిగలో ఉప్పు వేసు సుకోవచ్చు.ఎందుకంటే ఉప్పులో ఉండే సోడియం రక్తపోటును పెంచుతుంది.
కాబట్టి మజ్జిగను త్రాగటం మర్చిపోకండి ఆరోగ్యంగా వుండండి. .

Related posts