telugu navyamedia
Uncategorized ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు వ్యాపార వార్తలు సామాజిక

జున్నుతో… ఆరోగ్యరహస్యాలు…

cheese and its health benefits

అన్ని ప్యాకింగ్ లో కొని తినటం తప్పని పరిస్థితి లో ఉన్న ఇప్పటివారికి, అసలు అవి ఎలా చేస్తారు అనేది కూడా తెలియకుండానే తినేస్తుంటారు. అంతగా తినేదాని గురించి ఆలోచించే తీరిక లేదనుకోండి, కానీ, తెలుసుకొని తినాలి. అప్పుడే ఏది ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది, ఎందులో ఎంతెంత పోషకాలు ఉన్నాయి అనేవి తెలుస్తుంటాయి. అలా తెలుసుకొని, మన శరీరానికి యెంత అవసరంలో అంతే తీసుకోవాలి.. అదే ఆరోగ్యం. అందుకే ఏదైనా ఎక్కువ అయితే విషం అవుతుందని పెద్దలు కూడా అన్నారు. పాలు, పాలపదార్దాలతో వచ్చే ఆరోగ్యం గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇవి ఏ వయసువారైనా తీసుకోదగినవి. మరి అందులో జున్ను స్థానమే వేరు. గేదె లేదా ఆవు ప్ర‌స‌వించిన‌ప్పుడు మొద‌టి సారిగా వ‌చ్చే పాల‌ను జున్ను పాలు అంటారు. అలా కాకుండా సాధార‌ణ పాల‌ను విర‌గ్గొట్టి కూడా జున్ను తయారు చేసుకోవ‌చ్చు. అయితే సాధార‌ణంగా జున్నులో పాల క‌న్నా పోష‌కాలు ఎక్కువగా ఉంటాయి. జున్నును చాలా మంది అనేక ర‌కాలుగా త‌యారు చేసుకుని తింటారు. ఎలా తిన్నా జున్ను వ‌ల్ల మ‌న‌కు అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అసలు ఆ ప్రయోజనాలు ఏమిటి… అనేవి కొన్ని తెలుసుకుందాం.

* జున్నులో కాల్షియం ఎక్కువ‌గా ఉంటుంది. ఇది దంతాలు, ఎముక‌ల‌ను దృఢంగా చేస్తుంది. గ‌ర్భిణీలు జున్ను తిన‌డం వ‌ల్ల బిడ్డ ఎదుగుద‌ల సరిగ్గా ఉంటుంది.

* విట‌మిన్ డి, లోపం ఉన్న వారు జున్ను తిన‌డం వ‌ల్ల ఆ లోపాన్ని స‌రి చేసుకోవ‌చ్చు. జున్నును త‌ర‌చూ తీసుకోవ‌డం వ‌ల్ల ఆస్టియోపోరోసిస్ రాకుండా ఉంటుంది.

* హైబీపీ ఉన్న వారు జున్ను తిన‌డం మంచిది. బరువు పెర‌గాల‌నుకునే వారికి జున్ను ద్వారా ప్రోటీన్లు, కొవ్వులు అందుతాయి.

* జున్నులో ఉండే విట‌మిన్ బి2, జీవ‌క్రియ‌లు స‌రిగ్గా జ‌రిగేందుకు దోహ‌ద‌ప‌డుతుంది. జున్ను తిన‌డం వ‌ల్ల చ‌ర్మ సౌందర్యం కూడా పెరుగుతుంది.

* జున్నులో ఉండే విట‌మిన్ ఎ, శ‌రీర రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ‌ను ప‌టిష్ట ప‌రుస్తుంది. విరేచ‌నాలు, మ‌ల‌బ‌ద్ద‌కం త‌గ్గుతాయి.

Related posts