telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్

ఉల్లి తొక్కతో కూడా.. బోలెడు ప్రయోజనాలు.. తెలుసా..!

onion skin also very useful for many reasons

తినే ప్రతి పదార్థం దాదాపుగా తొక్క కలిగి ఉంటుంది. గతంలో ఆ తొక్క ను కూడా అనేక విధాలుగా ఉపయోగించేవారు. కానీ ఇప్పటి తరుణంలో తొక్క శుభ్రంగా తొలగించి లోన పండో, కాయో తింటున్నారు. ఈ తొక్కలో కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని ఇప్పటికే కొందరు తెలుసుకొని, వాటిని కూడా రకరకాలుగా వాడుతున్నారు. మనం ప్రతి రోజు ఉల్లిపాయలను వాడుతూ ఉంటాం. కూరల్లో ఉల్లిపాయ లేనిదే గడవదు. అలాగే కొంత మంది పచ్చి ఉల్లిపాయను పచ్చడిలో నంజుకొని తింటూ ఉంటారు. ఇంకొందరు మజ్జిగలో వేసుకొని త్రాగుతూ ఉంటారు. అయితే మనం ఉల్లిపాయ తొక్కలను పాడేస్తూ ఉంటాం. కానీ వాటిలో కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. వాటి గురించి తెలిస్తే చాలా ఆశ్చర్యపోతారు. వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.

* ఉల్లి తొక్కలను రాత్రంతా నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఆ నీటితో నొప్పులు ఉన్న చోట రాస్తే నొప్పులు తొందరగా తగ్గుతాయి. ఈ నీటిని చర్మానికి రాసుకొని అరగంట అయ్యాక స్నానము చేస్తే చర్మ సమస్యలు తగ్గిపోతాయి.

onion skin also very useful for many reasons* ఒక గిన్నెలో నీటిని తీసుకోని ఆ నీటిలో ఉల్లిపాయ తొక్కలను వేసి కిటికీలు, గుమ్మాల వద్ద పెడితే దోమలు ఇంటిలోకి రావు. ఉల్లి ఘాటుకు దోమలు పారిపోతాయి.

* ఉల్లిపాయ తొక్కలను మెత్తని పేస్ట్ గా చేసి తలకు పట్టించి పావుగంట తర్వాత తేలికపాటి షాంపూతో తలస్నానం చేస్తే తలలో చుండ్రు తగ్గటమే కాకుండా జుట్టురాలే సమస్య కూడా తగ్గుతుంది.

* ఉల్లిపాయ తొక్కలతో సూప్ చేసుకొని త్రాగితే శరీరంలో చెడు కొలస్ట్రాల్ తొలగిపోతుంది. దానితో గుండె జబ్బులు రాకుండా చేయటమే కాకుండా అధిక బరువు తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ సూప్ యాంటీ బ‌యోటిక్‌, యాంటీ ఫంగ‌ల్ ఏజెంట్‌గా పనిచేయటం వలన ఇన్ ఫెక్షన్స్ రావు.

Related posts