telugu navyamedia
సినిమా వార్తలు

“డిస్కో రాజా”తో “ఇస్మార్ట్” హీరోయిన్

Disco-Raja

విఐ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో మాస్ మ‌హారాజా ర‌వితేజ న‌టిస్తున్న తాజా చిత్రం “డిస్కో రాజా”. ఈ చిత్రంలో రవితేజ సరసన పాయ‌ల్ రాజ్‌పుత్‌, న‌భా న‌టేష్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఎస్.ఆర్.టి. ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై నిర్మితమ‌వుతున్న ఈ చిత్రం సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతుంది. ప్ర‌స్తుతం మూవీ చిత్రీక‌ర‌ణ సింగ‌పూర్‌లో జ‌రుగుతుంది. ఇప్పటికే ఈ చిత్రం టీంతో పాయ‌ల్ రాజ్‌పుత్ జాయిన్ కాగా… ఇప్పుడు న‌భా నటేష్ షూటింగ్ లో హాజరవుతోంది. ర‌వితేజతో క‌లిసి న‌భాన‌టేష్ దిగిన ఫోటోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. ఈ చిత్రంలో సునీల్, రామ్‌కీ, బాబీ సింహా, వెన్నెల కిషోర్ త‌దితరులు కీల‌క పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ఎస్.ఎస్.తమన్ స్వరాలు సమకూరుస్తున్నారు. కార్తిక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ ఏడాదే “డిస్కో రాజా” ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Related posts