telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

పాక్ బౌలర్ తో షాహిద్ అఫ్రిది కూతురి పెళ్లి….

పాకిస్థాన్ మాజీ క్రికెట‌ర్ షాహిద్ అఫ్రిది పెద్ద కూతురు అక్సాను పాక్ జట్టు యువ పేసర్ షాహిన్ అఫ్రిది పెళ్లి చేసుకోనున్నాడనే ప్రచారం గత కొంతకాలంగా జరుగుతున్న విషయం తెలిసిందే. వీరి పెళ్లి విషయంపై షాహిన్ షా తండ్రి ఓ మీడియా చానెల్‌తో ప్రస్తావించడం.. షాహీన్ షా కుటుంబ స‌భ్యులు త‌మ‌ కుటుంబాన్ని క‌లిసి మాట్లాడిన‌ట్లు షాహిద్ అఫ్రిది కూడా ట్విట‌ర్ ద్వారా స్పష్టం చేయడంతో ఈ వార్తలకు బలం చేకూరింది. అయితే షాహిన్ కెరీర్ ఇంకా ఆరంభంలోనే ఉండటం, అక్సా చదువు పూర్తికాకపోవడంతో వీరి వివాహానికి మరో రెండేళ్లు పట్టవచ్చని ఇరు కుటుంబాల సభ్యులు తెలిపారు. పెళ్లిళ్లు స్వ‌ర్గంలోనే నిశ్చ‌య‌మ‌వుతాయని, ఆ అల్లా ద‌య‌త‌లిస్తే వీళ్ల పెళ్లి కూడా జ‌రుగుతుందని గతంలో అఫ్రిది ట్వీట్‌ చేసిన విషయం తెలిసిందే. అక్సా, షాహిన్ రిలేషన్‌లో ఉన్నారని, వీరిద్దరూ పీకల్లోతూ ప్రేమలో మునిగి తేలడంతోనే వివాహం చేస్తున్నారనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. వీటిని అఫ్రిది ఖండించాడు. షాహిన్‌తో తన కూతురుకు ఎలాంటి ఎఫైర్ లేదని, పెద్దల అంగీకారంతోనే ఈ వివాహం నిశ్చయమైందని స్పష్టం చేశాడు. ఇంతకుముందు షాహిన్ కుటుంబంతో తమకు ఎలాంటి సత్సంబంధాలు కూడా లేవని, ఇరు కుటుంబాలు భిన్న తెగలకు చెందినవని చెప్పుకొచ్చాడు. షాహిన్ పేరేంట్స్ తన కూతురును కోడలుగా చేసుకోవటానికి ఆసక్తి చూపిస్తున్నారని, దాంతోనే ఈ సంబంధం ఏర్పడిందన్నాడు.

Related posts