telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

టాయిలెట్ పొజీషన్‌లో… నెటిజన్స్‌కు కొత్త పరీక్ష పెట్టిన ఉపాసన

upasana

కరోనా విషయంలో నెటిజన్స్‌కు ఎప్పటికప్పుడు సూచనలు సలహాలు చేస్తుంటుంది ఉపాసన కొణిదెల. ఇప్పుడు ఉపాసన మరో ట్వీట్ చేసింది. 5 నిమిషాల పాటు ఇలా కూర్చోగలరా అంటూ నెటిజన్స్‌కు కొత్త పరీక్ష పెట్టింది ఉపాసన. నగరంలో నివసించే చాలామంది ప్రజలకు ఈ స్థితిలో కూర్చోవడానికి కష్టపడతారు. ఇది చాలా కఠినంగా ఉంది’ అంటూ ఉపాసన ట్వీట్ చేసింది.మోకాళ్ల మీద రెండు చేతులు సపోర్ట్ చేసి కూర్చుని ఉన్న ఫొటోని కూడా ఆమె తన ట్విట్టర్‌లో పోస్టు చేసింది. ఇలా కూర్చోవడం చూసే వారికి చాలా ఈజీగా కనిపిస్తుంది కానీ అలా కూర్చోవడం చాలా కష్టం, హైదరాబాద్ లో చాలా మంది ఇలా కూర్చోవడానికి కష్ట పడతారని ఆమె పేర్కొంది. నిజానికి ఇది వినడానికి చూడడానికి కాస్త ఎబ్బెట్టుగా ఉన్నా ఉపాసన చెప్పింది నూటికి నూరుపాళ్లు నిజమే. ఎందుకంటే ఒకప్పుడు మన పూర్వీకులు మల విసర్జన కోసం ఒక పద్దతిని శాస్త్రీయ పద్దతుల్లో కనిపెట్టారు. కానీ ఇప్పుడు చాలామంది ఇళ్లలో ఇండియన్ టాయ్ లెట్ లు కనిపించడం లేదు. అందరూ వెస్ట్రన్ వాష్ రూమ్ లను వాడుతున్నారు.ఉపాసన ట్వీట్‌పై నెటిజన్స్ బాగానే స్పందిస్తున్నారు. సెలబ్రిటీ అయినప్పటికీ ఇలాంటివి చేయడం నీకే సాధ్యం అంటూ కొందరు ఉపాసనను మెచ్చుకుంటున్నారు. 

Related posts