telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

హైదరాబాద్ లో .. చిరంజీవి కోసం.. మరో పెద్ద సెట్టింగ్ తో .. కొరటాల …

anasuya with chiranjeevi in koritala movie

సైరా తరువాత చిరంజీవి, కొరటాలతో చేస్తున్న విషయం తెలిసిందే. చారిత్రక నేపథ్యంలో నిర్మితమవుతోన్న సైరా సినిమాను అక్టోబర్ 2వ తేదీన విడుదల చేయనున్నారనే టాక్ వినిపిస్తోంది. ఆగస్టు 22న ఈ సినిమా నుంచి ట్రైలర్ రానున్నట్టుగా తెలుస్తోంది. ఇదే రోజున కొరటాలతో చిరూ సినిమాను లాంచ్ చేయనున్నట్టు సమాచారం.

ఇప్పటికే కొరటాల చిరంజీవి కోసం హైదరాబాద్ శివారుల్లో ప్రత్యేకంగా భారీ సెట్స్ ను వేస్తున్నారట. చాలా వరకూ ఈ సెట్టింగ్స్ లోనే షూటింగు జరుగుతుందని చెబుతున్నారు. ఈ సినిమాలో చిరంజీవి ద్విపాత్రాభినయం చేయనున్నారు. అందువలన ఇద్దరు కథానాయికల అవసరం వుంది. ఒక కథానాయిక పాత్ర కాస్త డీసెంట్ గా వుండే పాత్ర కావడంతో, నయనతారనే అనుకుంటున్నారట. మరో కథానాయిక కోసం కొంతమంది పేర్లను పరిశీలిస్తున్నారని అంటున్నారు. ఆ ఛాన్స్ ఏ కథానాయికకు దక్కుతుందో చూడాలి!!

Related posts