telugu navyamedia
రాశి ఫలాలు

నవంబర్ 26, శుక్రవారం రాశిఫలాలు

మేష రాశి..

మిత్రుల నుంచి ఒత్తిడులు ఎక్కువ‌వుతాయి.ఆలయాలు సందర్శిస్తారు. తోటివారి సహకారంతో ఆపదలు తొలగుతాయి. మనోవిచారాన్ని కలిగించే సంఘటనలకు దూరంగా ఉండాలి. వ్యాపారులకు సమయం అన్నివిధాలా అనుకూలంగా ఉంది. శివారాధన చేస్తే కలిసొస్తుంది. సంఘంలో గౌర‌వ మ‌ర్యాద‌లుంటాయి.

వృషభ రాశి..

అభివృద్ధి వైపు అడుగులు వేస్తారు. కొద్దిపాటి సమస్యలు ఉన్నప్పటికీ ఆరోగ్యం ఫరవాలేదనిపిస్తుంది. వృత్తి నిపుణులకు పరవాలేదు. ఎవరికీ హామీలు ఉండవద్దు. మానసికంగా దృఢంగా ఉంటారు. శ‌త్రు బాధ‌లుండ‌వు. విద్యార్థులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. ఉద్యోగ వివాహ యత్నాలు అనుకూలిస్తాయి.

మిథున రాశి..

పనుల్లో అవాంతరాలు క‌లుగుతాయి. కొత్త రుణాలు కోసం ప్ర‌యత్నాలు చేస్తారు . ఎలాంటి పరిస్థితులలోనూ మనోధైర్యాన్ని కోల్పోరు. కొన్ని కీలకమైన ప్రణాళికలు వేసి, వాటిని ప్రారంభిస్తారు. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. కోర్టు వ్యవహరాలు కొత్త మలుపు తిరుగుతాయి. ప్రత్యర్థులతో రాజీ కుదురుతుంది.

కర్కాటక రాశి..

మిత్రుల నుంచి ఊహించని పరిణామాలు ఎదురవుతాయి. ఉద్యోగులకు శుభకాలం రానుంది. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగస్తులు అధికారులతో మాటపడకుండా తగిన జాగ్రత్త వహించండి.

సింహ రాశి..

ఆప్తుల నుంచి ఒత్తిడులు ఏర్పడ‌తాయి. దూరప్రయాణాలు చేస్తారు. ఒప్పందాలు రద్దు. శుభఫలితాలు సొంతం అవుతాయి. కీలక కొనుగోలు వ్యవహారంలో మీకు లాభం చేకూరుతుంది. మీ రంగంలో మిమ్మల్ని అభిమానించేవారు పెరుగుతారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వ‌హించాలి.

కన్య రాశి..

బ్యాంకింగ్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికమవుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో మంచి ఫలితాలు ఉన్నాయి. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. పెళ్లి సంబంధం వాయిదా పడుతుంది. బంధుమిత్రుల ఆదరణ ఉంటుంది. దంపతుల మధ్య ఏకాగ్రత లోపం అధికమవుతుంది.

తుల రాశి..

లాయర్లకు, ఆడిటర్లకు సదావకాశాలు లభించినా వాటిని సద్వినియోగం చేసుకోలేకపోతారు. ఒక ముఖ్య వ్యవహారంలో కుటుంబ సభ్యుల సంపూర్ణ సహకారం లభిస్తుంది. అవసరానికి ఆర్థిక సహకారం లభిస్తుంది. పాత వస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కొంటారు.

వృశ్చిక రాశి..

వ్యాపారాభివృద్ధికి చేసే కృషిలో రాణిస్తారు. విద్యా, వైజ్ఞానికి విషయాల పట్ల ఆసక్తి పెరుగును. ప్రారంభించబోయే పనుల్లో తోటివారి సహకారం ఉంటుంది. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం. కొన్ని ముఖ్యమైన పనులలో పురోగతి ఉంటుంది.

ధనుస్సు రాశి..

వ్యాపారాభివృద్ధికి చేసే కృషిలో రాణిస్తారు. కోర్టు వ్యవహారాలు వాయిదా పడటంతో నిరుత్సాహం తప్పదు. ప్రారంభించబోయే పనుల్లో ఆటంకాలు కలుగకుండా వ్యవహరించాలి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆచితూచి వ్యవహరించాలి.తొందరపాటు నిర్ణయాలు ఇబ్బందులకు దారితీస్తాయి.

మకర రాశి..

సంఘంలో గౌరవం ల‌భిస్తుంది. వస్తులాభాలు, భూలాభాలు క‌లుగుతాయి. ఒక ముఖ్య వ్యవహారంలో ఆర్థిక సాయం అందుతుంది. చాలాకాలంగా చేస్తున్న పెళ్లి ప్రయత్నం ఫలిస్తుంది. చేతివృత్తులు, కళ, క్రీడాకారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. అనుకున్న పనులను అనుకున్నట్టు చేయగలుగుతారు.

కుంభ రాశి..

మానసికంగా దృఢంగా ఉండి, ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోగలుగుతారు. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. చేతివృత్తులు, కళ, క్రీడాకారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వ్యాపారుల ఆర్థిక పరిస్థితి బాగా ఉంటుంది.స్త్రీలకు ఆధ్యాత్మిక చింతనతోపాటు ఇతర వ్యాపకాలు అధికమవుతాయి.

మీన రాశి..

వస్త్ర, బంగారు, వెండి వ్యాపారస్తులకు కలిసి వచ్చే కాలం వ‌స్తుంది. మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ముఖ్య విషయాల్లో పెద్దల ఆశీర్వచనాలు అందుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. అనవసర ధనవ్యయం సూచితం. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. బంధువుల‌తో వివాదాలు తీరతాయి.

Related posts