మేషం : ఎంత శ్రమపడ్డా ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. దూరప్రయాణాలు. కుటుంబసభ్యులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.
వృషభం : పనుల్లో అవాంతరాలు. అనుకోని ప్రయాణాలు. బంధుమిత్రులతో కలహాలు. ఆరోగ్యభంగం. విద్యార్థులకు ఒత్తిడులు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు.
మిథునం : కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆలోచనలు అమలు చేస్తారు. ఆకస్మిక ధన,వస్తులాభాలు. మిత్రుల సహాయం అందుతుంది. వివాదాల పరిష్కారం. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి సాధిస్తారు.
కర్కాటకం : సన్నిహితులతో సఖ్యత. పరిచయాలు పెరుగుతాయి. నూతన ఉద్యోగాలు పొందుతారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. దైవదర్శనాలు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో అనుకూలస్థితి.
సింహం : పనులు నెమ్మదిగా సాగుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. విద్యార్థులు, నిరుద్యోగులకు శ్రమాధిక్యం. దూరప్రయాణాలు. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత గందరగోళం.
కన్య : ఆదాయం కంటే ఖర్చులు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు. పనులు వాయిదా వేస్తారు. అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో స్వల్ప అవాంతరాలు.
తుల : కొత్త పనులు చేపడతారు. ఆత్మీయుల నుంచి సలహాలు స్వీకరిస్తారు. సంఘంలో గౌరవం. వస్తులాభాలు. స్థిరాస్తి వివాదాల పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పూర్వవైభవం.
వృశ్చికం : పనులలో అవాంతరాలు. రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా కొంత గందరగోళం. ధనవ్యయం. శ్రమాధిక్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.
ధనుస్సు : ఇంటిలో శుభకార్యాలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. పలుకుబడి పెరుగుతుంది. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత పుంజుకుంటాయి.
మకరం : వ్యయప్రయాసలు. బంధుమిత్రులతో విభేదాలు. ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి. కొన్ని పనులు చివరిలో వాయిదా వేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.
కుంభం : వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. స్థిరాస్తి వివాదాల పరిష్కారం. శుభకార్యాలకు హాజరవుతారు. దూరపుబంధువుల కలయిక. ధనలబ్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకున్న ప్రగతి ఉంటుంది.
మీనం : ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆహ్వానాలు అందుతాయి. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. సోదరుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీదే పైచేయిగా ఉంటుంది.