telugu navyamedia
రాశి ఫలాలు

ఈరోజు ఈ రాశి వారి ఆరోగ్యం జాగ్రత్త

Today Rasi Phalalu

మేష రాశి
చక్కని ఆరోగ్యం, క్రీడాపోటీలలో పాల్గొనడానికి అనుమతిస్తుంది. మీరొకవేళ కొద్దిగా ఎక్కువ డబ్బు సంపాదిద్దామనుకుంటే- సురక్షితమయిన ఆర్థిక పథకాలలో మదుపు చేయండి. మీ అభిప్రాయాలను మీ స్నేహితులపైన బంధువులపైన రుద్దకండి. అది మీ అభిరుచికి సమానం కాకపోవచ్చును. దాంతో అనవసరంగా వారందరినీ కోపం వచ్చేలా చేయవచ్చును. డేట్ ప్రొగ్రామ్ విఫలమయినందువలన నిరాశను ఎదుర్కోబోతున్నారు. మీ చుట్టూరా ఉన్న సమస్యలు పరిష్కరించడానికి మీ పరపతిని వాడవలసిన అవసరం ఉన్నది. ఈ రోజు, మీరు మీ మేధకు పదును పెడతారు. చదరంగం- గడినుడి వంటి పజిల్ లు ఆడితే, కొందరు కథ – కవిత లేదా భవిష్యత్ ప్రణాళికలు చేపడతారు. ఈ రోజు బంధువుల కారణంగా కాస్త గొడవ కావచ్చు. కానీ చివరికి అంతా అందంగా పరిష్కారమవుతుంది.

వృషభ రాశి
మీ మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకొండి. అదే ఆధ్యాత్మికతకు ప్రాథమిక అర్హత. మనసే, జీవితానికి ప్రధాన ద్వారం. మరి మంచి/చెడు ఏదైనా మనసుద్వారానేకదా అనుభవానికి వచ్చేది. అదే జీవితంలోని సమస్యలను పరిష్కరించగలదు. ప్రకాశింపచేయగలదు. రోజులోని రెండవభాగంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మీ ప్రవర్తనలో సరళతను కలిగిఉండి, మీ కుటుంబసభ్యులతో చక్కని ఆనందమయ సమయాన్ని గడపండి. మీ స్వీట్ హార్ట్ ఓ లివింగ్ ఏంజెల్ మాదిరిగా ఈ రోజు మిమ్మల్ని మురిపించనుంది. ఆ అద్భుత క్షణాలను అలా ఆస్వాదించండి. పనిచేసే చోట, ఇంటిలోను వత్తిడి మిమ్మల్ని కోపిష్ఠి వారిగా చేయవచ్చును. మీకు కావాలనుకున్న విధంగా చాలావరకు నెరవేరడంతో, రోజంతా మీకు నవ్వులను మెరిపించి మురిపించే రోజు. ఈ ప్రపంచం మొత్తంలో మీరొక్కరే ఉన్నారని అనిపించేలా ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీతో ప్రవర్తిస్తారు.

మిథున రాశి
విచారంలో ఉన్నవారికి మీ శక్రిని వాడి సహాయం చెయ్యండి. గుర్తుంచుకొండి, ఇతరుల అవసరాకు ఉపయోగపడ లేకపోతే ఈ నాశనమైపోయే మానవ శరీరానికి గల అర్థమేముంది, ఏమీలేదు. తొందరపాటు నిర్ణయాలు చేయవద్దు. ప్రత్యేకించి భారీ ఆర్థిక వ్యహారాలలో నిర్ణయాల సమయంలో జాగ్రత్తగా ఉండండి. శ్రీమతితో షాపింగ్ భలే వినోదమే. అది మీ ఇద్దరి మధ్య అర్థం చేసుకోవడాన్ని పెంపొందించింది. మీ ప్రేమ జీవితంపరంగా ఈ రోజు ఎంతో అద్భుతమైనది. ప్రేమలో పడ్డప్పుడు ఉండే స్వర్గానుభూతిని ఈ రోజు మీరు చవిచూస్తారు. మీ లక్ష్యాల గురించి యోచనకు మంచి రోజు. వాటిని వీలైనంత త్వరగా సాధించడానికి గాను, నిర్విరామంగా పనిచేయడానికి వీలుగా మీ శరీరాన్ని రీఛార్జ్ చేసుకొండి. ఈ విషయమై మీరు మీ స్నేహితుల సహాయం తీసుకోవచ్చును. అది మీ మానసిక శక్తిని బూస్ట్ చేసి, లక్ష్య సాధనకి సహాయపడుతుంది. ప్రయాణాలకు అంత మంచి రోజు కాదు. వైవాహిక జీవితంలో ఎన్నో సానుకూలతలు కూడా ఉన్నాయి. వాటన్నింటినీ మీరు ఈ రోజు అనుభూతి పొందనున్నారు.

కటక రాశి
మీ శారీరక సౌష్ఠవం కోసం, క్రీడలలో సమయాన్ని గడుపుతారు. తొందరపాటుతో పెట్టుబడులకి పూనుకోకండి. సాధ్యమయిన అన్ని కోణాలలోంచి, పెట్టుబడులని పరిశీలన జరపకపోతే నష్టాలు తప్పవు. శ్రీమతి మరియు పిల్లలు, మరింత ఎక్కువ ప్రేమను అభిమానాన్ని శ్రద్ధను కురిపిస్తారు. గ్రహచలనం రీత్యా,ఒక కుతూహలం కలిగించే వ్యక్తిని కలిసే అవకాశాలు ఉన్నాయి. సహ ఉద్యోగులతో మసిలేటప్పుడు, తెలివి, ఉపాయం అవసరం శాస్త్రోక్తమైన కర్మలు/ హోమాలు/ పవిత్రమైన వేడుకలు ఇంటిలో నిర్వహించబడతాయి. మిమ్మల్ని సంతోషపెట్టేందుకు మీ జీవిత భాగస్వామి ఈ రోజు అన్ని ప్రయత్నాలూ చేస్తారు.

సింహరాశి
మీ భయాన్ని నివారించుకోవడానికి ఇది కీలకమైన సమయం. అది, శారీరక శక్తిని తగ్గించడమే కాదు, ఆయుర్దాయాన్ని కూడా హరించివేస్తుందని మీరు గుర్తించాలి. ఈరోజు మదుపు చెయ్యడం అనేది మీ వృద్ధిని, ఆర్థిక సురక్షణని మెరుగుపరుస్తుంది. బంధువులతో బంధాలను, అనుబంధాలను పునరుద్ధరించుకోవలసిన రోజు. అల్లం, గులాబీలతో కూడిన చాక్లెట్ ను ఎప్పుడైనా రుచి చూశారా? మీ ప్రేమ జీవితం ఈ ర ఓజు మీకు అలాంటి రుచిని చవిచూపనుంది. బిజినెస్ మీటింగులలో ముక్కుసూటిగా మాటాడడం, భావోద్వేగాలకు లోనుకావడం వంటివి చేయకండి. అవి మీరు అదుపు చేయలేకపోతే, మీ ప్రతిష్టని దెబ్బతీస్తాయి. మీకు పనిపట్ల విధేయత, పనులు జరిగేలా చూడడంలో మీ సామర్థ్యం, మిమ్మల్ని గుర్తింపు వచ్చేలా చేస్తాయి. కళ్లే అన్నీ చెబుతాయి. ఈ రోజు మీ జీవిత భాగస్వామితో మీరు కళ్ల భాషలో భావోద్వేగపరంగా మాట్లాడుకుంటారు. ఎన్నో ఊసులాడుకుంటారు.

కన్యా రాశి
మీరు సేదతీరగల రోజు. శరీరానికి నూనె మర్దనా చేయించుకుని కండరాలకు విశ్రాంతిని కలిగించండి. మీ అంకిత భావం, కష్టించి పని చేయడం, గుర్తింపునందుతాయి. ఈరోజు అవి కొన్ని ఆర్థిక లాభాలను తీసుకువస్తాయి. మీ కుటుంబసభ్యులకి సహాయం చెయ్యడానికి మీకున్న ఖాళీ సమయాన్ని కేటాయించండి. మీ ప్రియమైన వ్యక్తి మీకు బోలెడు సంతోషాన్ని తెస్తున్నట్లున్నారు,కనుక మీ ఎనర్జీ స్థాయి చాలా ఎక్కువ. సరియైన సమయానికి ప్రాజెక్ట్ లని పూర్తి చెయ్యడంవలన వృత్తి పరంగా మంచి లాభాలు పొందుతారు. అధిగమించాలన్న సంకల్పం ఉన్నంత వరకూ అసాధ్యమేమీ లేదు. పెళ్లి తాలూకు నిజమైన పారవశ్యం ఎలా ఉంటుందో ఈ రోజు మీకు తెలిసిరానుంది.

తులా రాశి
ఇతరుల విజయాలను పొగడడం ద్వారా, ఆనందిస్తారు. మీ పెట్టుబడులు, భవిష్యత్తు గమ్యాలను గురించి గోప్యతను పాటించండి. పిల్లలు తమవిజయాలతో మిమ్మల్ని, గర్వపడేలాగ, తలెత్తుకునేలా చేస్తారు. ఇతరుల జోక్యం, రాపిడి, ఒరిపిడికి కారణమవుతుంది. మీ కృషి ఈ రోజు ఆఫీసులో మీకు గుర్తింపు తేనుంది. వ్యాపారం కోసం వేసుకున్న ప్రయాణం ప్లాన్ దీర్ఘ కాలంలో ఫలవంతం కాగలదు. ఈ రోజు మీ జీవిత భాగస్వామి డిమాండ్లు మిమ్మల్ని ఒత్తిడికి గురిచేయవచ్చు.

వృశ్చికరాశి
ఇతరులకు చెడుచెయ్యాలన్న ఆలోచనలను రానిస్తే మీకే మానసిక ఆందోళన కలిగిస్తుంది. ఈ రకమైన ఆలోచనలు జీవితాన్ని వృధా చేస్తాయి, పైగా మీ సామర్థ్యాన్ని నాశనం చేస్తాయి. కనుక వీటిని మానండి. అతిగా ఖర్చు చేయడం, మీ ఆర్థిక పథకాలు కలలకు దూరంగా ఉండేలాగ చూసుకొండి. మీ కుటుంబం వారు ఏమిచెప్పినా మీరు అంగీకరించక పోవచ్చును. కానీ మీరుమాత్రం వారి అనుభవాలనుండి వ్చాలా నేర్చుకోవాలి. ఓటమి ఈరోజు మీవెనుకనే ఉంటుంది, కనుక వాటినుండి పాఠాలు నేర్చుకొవాలి. మీరు ఒకరోజు శెలవుపై వెళుతుంటే కనుక, ఫరవాలేదు వర్రీ కాకండి- ఎందుకంటే, మీరు రాకపోయినా, మీ పరోక్షంలో కూడా, విషయాలు సజావుగా నడిచిపోతాయి. ఒకవేళ క్రొత్త కారణం తలెత్తితే అయినా సమస్య కాదు, ఎందుకంటే, మీరు తిరిగి వచ్చిన తరువాత సులువుగా పరిష్కరిస్తారు. మీరీ రోజు ప్రయాణం చేస్తుంటే కనుక మీ సామానుగురించి జాగ్రత్త వహించండి. ఈ రోజు మీ జీవిత భాగస్వామి చర్య వల్ల మీరు బాగా ఇబ్బందికి గురవుతారు. కానీ అది మంచికే జరిగిందని ఆ తర్వాత మీరే గ్రహిస్తారు.

ధనుస్సు రాశి
మీభావనలపై మీరు నియంత్రణ చేయాలి. అంతగా ప్రయోజనకరమైన రోజు కాదు- కనుక, మీవద్దగల డబ్బును జాగ్రత్తగా చెక్ చేసుకుని మీ ఖర్చులను పరిమితం చేసుకొండి. ‘మీ రోజువారీ యాంత్రిక జీవనానికి అడ్డుకట్ట వేస్తూ మీ స్నేహితులతో బయటకు వెళ్ళండి. రొమాన్స్ కి మంచి రోజు. ఆఫీసులో ఈ రోజు మీరు చేసే పని తాలూకు నాణ్యత చూసి మీ సీనియర్ ఎంతగానో ఇంప్రెస్ అయే అవకాశముంది. మీరు ప్రవేశించిన ఏపోటీ అయినా మీకుగల పోటీ తత్వం వలన గెలుచుకునే వస్తారు. వైవాహిక జీవితపు మధురిమను ఈ రో జు మీరు రెండు చేతులా గ్రోలుతారు.

మకర రాశి
ఈ రోజు మీ వ్యక్తిత్వం సుగంధమైనట్లుంది. ధనలాభాలు మీరు అనుకున్నంతగా రావు. మీ జీవిత భాగస్వామి మీకు సంతోషాన్ని అందించదలుచుకోవడంవలన మీకు రోజంతా ఆహ్లాదకరమే. మీ స్వీట్ హార్ట్ మిమ్మల్ని ఈ రోజు ఎంతగానో మిస్ కానున్నారు. కాబట్టి ఒక మంచి సర్ ప్రైజ్ ను ప్లాన్ చేయండి. తద్వారా ఈ రోజును మీ జీవితంలోకెల్లా అందమైన రోజుగా మలచుకోండి. ఆకాశం మరింత ప్రకాశవంతంగా, పూలు మరింత రంగులమయంగా, మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కటీ మరింత మెరుస్తూ కన్పిస్తుంది. ఎందుకంటే మీరు ప్రేమలో మునిగారు మరి! మీరోజును బాగా ఉత్తమమైనదిగా చెయ్యలని మీ నిజ లక్షణాలను మరుగుపరుస్తారు. నులివెచ్చని స్పర్శలు, ముద్దులు, కౌగిలింతలకు వైవాహిక జీవితంలో ఎనలేని ప్రాధాన్యముంది. వాటన్నింటినీ ఈ రోజు మీరు ఎంతగానో అనుభూతిలోకి తెచ్చుకోనున్నారు.

కుంభరాశి
పరిస్థితిపై ఒకసారి అదుపు వచ్చాక, మీ ఆతృత మాయమైపోతుంది. మీరు తెలుసుకోవలసినదేమంటే ఇది సబ్బు బుడగ తాకగానే కనిపించనట్లుగానే, ధైర్యంతో తాకగానే ఈ ఆతృత, భయం, యాంగ్జైటీ అనేవి మొదటి స్పర్శలోనే కరిగిపోతాయని అర్థం చేసుకోవాలి. ఈరోజు మీకు, బోలెడు ఆర్థిక పథకాలను ప్రెజెంట్ చేస్తారు. కమిట్ అయేముందుగా వాటి మంచి చెడ్డలను పరిశీలించండి. మీకు అదనంగా మిగిలిన సమయాన్ని, పిల్లలతో గడపండి. మీ తత్వానికి వ్యతిరేకమైనా సరే ఈ పని చెయ్యండి. ప్రియమైన వారులేకుండా కాలం గడవడం కష్టమే. మీ కష్టం, అంకితభావం, మీగురించి చెప్తాయి. అవి మీకు నమ్మకాన్ని, ఆసరాని ఇస్తాయి. మీకు అనుకూలమైన గ్రహాలు, ఈరోజు మీ సంతోషానికి, ఎన్నెన్నో కారణాలను చూపగలవు. వైవాహిక జీవితంలో క్లిష్టతరమైన దశ తర్వాత ఈ రోజు మీకు కాస్త ఉపశమనాన్ని కలిగిస్తుంది.

మీన రాశి
ఈరోజు మీరు, పూర్తి హుషారులో, శక్తివంతులై ఉంటారు. ఏపని చేసినా, సాధారణంగా మీరు చేసే కంటే సగం సమయంలోనే, పూర్తిచేసేస్తారు. ధనలాభాలు మీరు అనుకున్నంతగా రావు. కుటుంబ బాధ్యతలు మీ మనసుకు ఆందోళన పెంచేలాగ ఉంటాయి. మీ డార్లింగ్ ఇవాళ మీకోసం మీరుతెచ్చే బహుమతులతో పాటుగా కొంతసేపు వస్తారని, ఎదురుచూస్తారు. మీరు ఖచ్చితంగా డలివరీ చెయ్యగలనౌ అనుకుంటేనే, ఎవరికైనా దేనినైన వాగ్దానం చెయ్యండి. మీరు ఎప్పుడూ వినాలి అనుకున్నట్లుగా నే జనులు మిమ్మల్ని ప్రశంసిస్తారు. ఈ రోజు మీ జీవిత భాగస్వామితో కలిసి మీరు చాలా డబ్బు ఖర్చు పెడతారనిపిస్తోంది. కానీ అలా చేయడం ద్వారా మీరు అద్భుతమైన సమయాన్ని కలిసి గడుపుతారు.

Related posts