telugu navyamedia
రాశి ఫలాలు

న‌వంబ‌ర్ 27, శ‌నివారం రాశిఫ‌లాలు..

మేషరాశి..

ముఖ్యమైన పనుల్లో అవాంతరాలు ఏర్ప‌డ‌తాయి. బంధువుల నుంచి ఒత్తిడులు ఎదుర‌వుతాయి. ఆధ్యాత్మిక చింతన క‌లుగుతుంది. శారీరక రుగ్మతలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.ఆపదలు తొలగుతాయి. ఆచితూచి మాట్లాడాల్సి ఉంటుంది.గృహంలో ఒక శుభకార్యానికి అనువైన వాతావరణం నెలకొంటుంది.

వృషభరాశి..

పారిశ్రామిక రంగాల వారికి ప్రోత్సాహం లభిస్తుంది. కష్టమే తప్ప ఫలితం కనిపించదు. పనులు వాయిదా వేస్తారు. బంధువులతో తగాదాలు ఏర్ప‌డ‌తాయి. ఆకస్మిక ప్రయాణాలు. మానసిక అశాంతి ఏర్ప‌డుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు ఎదుర‌వుతాయి. దైవ‌కార్యాల్లో పాల్గొంటారు.

మిథునరాశి..

చిట్స్, ఫైనాన్సు రంగాల వారికి ఖాతాదారులతో సమస్యలు తప్పవు. కోర్టు వ్యవహారాల్లో కొంత పురోగతి కనిపిస్తుంది. ఆకస్మిక ధనలాభాలు. పోగొట్టుకున్న వస్తువులు దక్కుతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. యత్నకార్యసిద్ధి. నూతన పరిచయాలు ఏర్ప‌డ‌తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

కర్కాటకరాశి..

కోర్టు వ్యవహరాలు వాయిదా కోరుకోవటం మంచిది. ప్రముఖుల సహకారంతో ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనులు సానుకూలమవుతాయి. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు. దూరప్రయాణాలు చేస్తారు. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. . మీ మనోధైర్యం మిమ్మల్ని గెలిపిస్తుంది. కొన్ని పరిస్థితులు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి.

సింహరాశి..

మీ పనితీరుతో అందరి మనసులను గెలుచుకుంటారు. కొత్త వ్యక్తుల పరిచయం ఏర్ప‌డుతుంది. శుభకార్యాలకు హాజరవుతారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు. విలువైన వస్తువులు సేకరిస్తారు. విదేశీయానం యత్నాల్లో కొంత పురోగతి కనిపిస్తుంది. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి.

కన్యరాశి..

ముఖ్య‌మైన పనులు వాయిదా వేస్తారు. బంధువులతో గొడ‌వ‌లు ఏర్ప‌డ‌తాయి. మనస్తాపం, శ్రమ పెరుగుతుంది. ఆలోచనలు నిలకడగా ఉండవు. పరిస్థితులు అనుకూలించవు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు క‌లుగుతాయి.నూతన పరిచయాలేర్పడతాయి.

తులరాశి..

మీ ఆంతరంగిక విషయాలు ఇతరుల ముందు పెట్టటం మంచిది కాదు.. కొత్త పనులు చేపడతారు. ఆలోచనలు అమలు చేస్తారు. వస్తులాభాలు ఉంటాయి. ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. దైవదర్శనాలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం క‌లుగుతుంది. ఆరోగ్యం కుదుట‌ప‌డుతుంది.

వృశ్చికరాశి..

కాంట్రాక్టర్లు, బిల్లర్లకు నిర్మాణ పనుల్లో ఏకాగ్రత ముఖ్యం. కొత్త విషయాలు తెలుస్తాయి. ప్రతిభకు గుర్తింపు పొందుతారు. కొత్త పనులు చేపడతారు. ఆలోచనలు అమలు చేస్తారు. వృత్తి, ఉద్యోగ,వ్యాపారాలలో మేలు చేకూరుతుంది.

ధనుస్సురాశి..
కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ప్రారంభించిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయగలుగుతారు. పనుల్లో ఆటంకాలు ఎదుర‌వుతాయి. ధనన‌ష్టం అవుతుంది. కుటుంబసభ్యులు, మిత్రులతో మాటపట్టింపులు ఎక్కువ‌వుతాయి. ఆకస్మిక ప్రయాణాలు. శ్రమ పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం ఏర్ప‌డుతుంది.

మకరరాశి..

విద్యార్థులకు ధ్యేయం పట్ల ఏకాగ్రత, కొత్త విషయాల పట్ల ఆసక్తి ఏర్పడతాయి. కొన్ని సమస్యలు వేధిస్తాయి. శ్రమాధిక్యం. పనులు వాయిదా వేస్తారు. దూరప్రయాణాలు. కుటుంబసభ్యులతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరాశ క‌లుగుతుంది.శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు.

కుంభరాశి..

తొందరపాటు నిర్ణయాల వల్ల కష్టనష్టాలకు గురికావలసి వస్తుంది. రుణాలు తీరి ఊరట చెందుతారు. ప్రయాణాలలో కొత్త పరిచయాలు ఏర్ప‌డ‌తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో మంచి పురోగ‌తి క‌నిపిస్తుంది.

మీనరాశి..

ప్రముఖులతో పరిచయాలు పెంచుకుంటారు. దూర ప్రయాణాల లక్ష్యం నెరవేరుతుంది. విదేశీయానం కోసం చేసే యత్నాలు అనుకూలించవు. నూతన వ్యవహారాలలో విజయం. ఆప్తుల నుంచి ధనలాభం. పలుకుబడి పెరుగుతుంది. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు లాభిస్తాయి.

Related posts