telugu navyamedia
రాశి ఫలాలు

డిసెంబ‌ర్ 21, మంగ‌ళ‌వారం రాశిఫ‌లాలు…

మేషరాశి..

కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్ప‌డ‌తాయి. చిత్తశుద్ధితో ప‌ని చేస్తే మంచి విజ‌యం సాధిస్తారు. ఆర్థికాభివృద్ధి మెరుగుప‌డుతుంది. ఆలయ దర్శనాలు చేస్తారు. నిరుద్యోగ యత్నాలు కలిసిరాగలవు. వ్యాపారాభివృద్ధికి చేయు కృషిలో సత్ఫలితాలు లభిస్తాయి.

వృషభరాశి..

ఓర్పు, పట్టుదలతో శ్రమించి మీరు అనుకున్నది సాధిస్తారు. పరిస్థితులు అంతగా అనుకూలించవు. బంధువులతో గొడ‌వ‌లు ఏర్ప‌డ‌తాయి. ఆరోగ్యం స‌హ‌క‌రించ‌దు. . పనులకు ఆటంకం కలుగకుండా చూసుకోవాలి. శ్రమ‌కు త‌గ్గ ఫ‌లితం ల‌భించ‌దు. దూరప్రయాణాలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

మిథునరాశి..

కీలక విషయాల్లో తోటివారి సలహాలు తప్పనిసరి. నూతన పరిచయాలు ఏర్ప‌డ‌తాయి. స‌మాజంలో మంచి గౌరవం ల‌భిస్తాయి. ఆస్తి కొనుగోలు చేయ‌డానికి మంచి సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. ఉద్యోగాలలో పనిఒత్తిడులు తొలగి అనుకూల ప‌రిస్థితులు ఏర్ప‌డ‌తాయి.

కర్కాటకరాశి..

స్త్రీలకు సంఘంలో మంచి గుర్తింపు లభిస్తుంది. పనుల్లో అండంకులు ఏర్ప‌డ‌తాయి. కొత్త రుణాలు చేస్తారు. ఆలోచనలు నిలకడగా సాగవు. వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు ఏర్ప‌డ‌తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు తొలుగుతాయి. మానసిక ఆనందాన్ని కలిగించే ఘటనలు చోటు చేసుకుంటాయి.

సింహరాశి..

విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. విద్యార్థులకు శుభవార్తలు వింటారు. వ‌స్తు, వాహనయోగం క‌లుగుతుంది. చిన్ననాటి స్నేహితుల‌ను క‌లుస్తారు. ప్రైవేటు సంస్థల్లో వారికి ఓర్పు, నేర్పు ఎంతో అవసరం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు ఏర్ప‌డ‌తాయి.

కన్యరాశి..

కొన్ని సంఘటనలు ఉత్సాహాన్ని కలిగిస్తాయి. అయిన‌వారి నుంచి సలహాలు స్వీకరిస్తారు. పాతబాకీలు వసూలవుతాయి. దైవదర్శనాలు చేస్తారు. నిరుద్యోగులకు దూర ప్రాంతాల నుండి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. కుటుంబంలో అనుకోని మార్పులు ఎదుర‌వుతాయి. ఆర్థికంగా స్థిర‌ప‌డ‌తారు.

తులరాశి..

వ్యవసాయరంగంలోని వారికి లాభదాయకంగా ఉంటుంది. తొందరపాటువల్ల ప్రయత్నకార్యాలు చెడిపోతాయి. చెడును కోరేవారికి దూరంగా ఉండడం మంచిది. ఆర్థిక ఇబ్బందుల వల్ల రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. పనిలో శ్రమ పెరిగినప్పటికీ అంత‌గా క‌లిసి రావు.

వృశ్చికరాశి..

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో శుభఫలితాలు ఏర్ప‌డ‌తాయి. ఆర్థిక విషయాలు నిరాశ పరుస్తాయి.శ్ర‌మ‌కు త‌గ్గ ఫ‌లితం ల‌భిస్తుంది. బంధుమిత్రులతో విభేదాలు ఏర్ప‌డ‌తాయి. అనారోగ్యం బారిన ప‌డ‌తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఇబ్బందిగా ఉంటాయి.

ధనుస్సురాశి..

బంధు, మిత్రులతో సరదాగా గడుపుతారు. విందువినోదాల్లో పాల్గొంటారు. ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి, ఏకాగ్రత పెంచుకుంటారు. అంద‌రితో స్నేహపూర్వక వాతావరణం ఉంటుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ప్రేమికుల మధ్య అనుమానాలు, అపార్థాలు తలెత్తుతాయి.

మకరరాశి..

శుభవార్త‌లు అందుతాయి. ఆకస్మిక ధనలాభముంటుంది. భూలాభాలు ఉంటాయి. వాహనాలు కొంటారు. వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఏర్ప‌డుతుంది. ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. అనవసర ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి.

కుంభరాశి..

అనుకోకుండా డబ్బు చేతికి అందుతుంది. నూతన వస్తు, ఆభరణాలు సేకరిస్తారు. అద్భుతమైన అవకాశాలను పొందుతారు. కుటుంబంలో ఒత్తిడులు ఏర్ప‌డ‌తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు అంత‌గా క‌లిసిరావు. ఉద్యోగస్తులకు తోటి వారి నుంచి అనుకోని సమాచారం అందుతుంది.

మీనరాశి..

కుటుంబంలో శుభకార్య ప్రయత్నం చేస్తారు. అర్థిక విషయాలు ఆశాజనకంగా ఉంటాయి. శ్రమపడ్డా ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు ఏర్ప‌డ‌తాయి. అనుకోని ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.ఆలయాలను సందర్శిస్తారు. అనారోగ్యం బారిన ప‌డ‌తారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం మంచిది.

Related posts