ఆ మధ్య నటి శ్రీ రెడ్డి తెలుగు చలన చిత్ర పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ ఎక్కువగా ఉందని..ఛాన్సులు రావాలంటే సదరు వ్యక్తుల కోరికలు తీర్చాలని..అప్పుడే సినిమా ఛాన్సులు ఇస్తున్నారని ఫిలిం ఛాంబర్ ఎదురుగా అర్ధనగ్న ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రభుత్వం స్పందించాలని..వెంటనే ఓ ఫ్యానల్ ఏర్పటు చేయాలనీ చాలామందే డిమాండ్ చేశారు. తాజాగా తెలంగాణ ప్రభుత్వం టాలీవుడ్‌లో లైంగిక వేధింపులపై ప్యానెల్‌ను ఏర్పాటు చేసింది.
ప్యానెల్ ఏర్పాటుకు రంగం సిద్ధం అవడంతో.. శ్రీ రెడ్డి కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపింది. ‘నా కల నిజమైంది. ఒక హైదరాబాద్ స్త్రీగా నేను చాలా గర్వపడుతున్నా.. ఈ ప్రపంచానికి నన్ను హీరోయిన్ ను కేసీఆర్ చేశారు. ఏడాదిలోపే అద్భుత ఫలితం ఇచ్చారు. ఉద్యమానికి సహకరించిన అందరికీ ధన్యవాదాలు.’ అంటూ సోషల్ మీడియాలో కేసీఆర్ కు సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపింది శ్రీరెడ్డి.
సెట్లో చిరాగ్గా… అయినా తప్పదు : జాన్వీ కపూర్