telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సృష్టిలోన వీడంత శృంగార ద్రోహి లేడు… “ఆర్జీవీ” నుంచి మరో లిరికల్ సాంగ్

RGV

వర్మ అరాచకాలకు కౌంటర్‌గా జొన్నవిత్తుల ‘ఆర్జీవీ’ సినిమాను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇటీవల ‘ఓడ్కా మీద ఒట్టు నేన్ బాడ్కోవ్ నా కొడ్కుని’ అంటూ వర్మను బండబూతులు తిట్టాడు జొన్నవిత్తుల. తాజాగా మరింత ఘాటు పెంచుతూ ‘దెయ్యంతోనే అన్నీ చేయ్యాలనుకుంటాడే వీడూ.. కల్లోకొచ్చిన కాష్మోరాతో కక్కుర్తి పడతాడు.. శాడిజమంతా సినిమాల్లోనా చూపిస్తుంటాడు’ అంటూ ఆర్జీవీను ఓ రేంజ్‌లో ఏకి పారేశాడు జొన్నవిత్తుల. ఇక ఈ పాటకు జొన్నవిత్తులు లిరిక్స్ అందించగా.. రేవంత్ ఈ పాటను పాడారు. వీణపాని సంగీతం అందించారు. కార్తీకేయ శ్రీనివాస్ ప్రజెంట్స్‌లో పొన్నూరి బాల కుటుంబ రావు ఈ చిత్రానికి నిర్మాతగా జొన్నవిత్తుల దర్శకత్వం వహిస్తున్నారు.

Related posts