ఉమ్మడి మెదక్ జిల్లాకు పీఎంజీ రోడ్లకు రూ.112 కోట్లు మంజూరు అయినట్లు తెలంగాణ మంత్రి హరీష్‌రావు తెలిపారు. జిల్లాలోని శివ్వంపేట దంతాన్‌పల్లిలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నర్సాపూర్ నియోజకవర్గానికి మొదటి విడతలో రూ.13 కోట్లు, రెండో విడతలో రూ.10 కోట్లు మంజూరు అవుతాయని అన్నారు.
మండలంలోని డంపు యార్డ్ స్మశాన వాటికలను 15 రోజుల్లో పూర్తి చేయాలని సర్పంచులను, కార్యదర్శులను ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు ఆదేశించారు. దంతాన్‌పల్లిలో ఉన్న దేవాదాయ భూములు సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలని కలెక్టర్‌ను ఆదేశించారు.