ఏపీ సీఎం చంద్రబాబు ఇప్పటికే రాహుల్ గాంధీతో పాటు మాయావతి, అఖిలేష్ యాదవ్‌ను కలిసి తాజా రాజకీయ పరిణామాలపై చర్చించిన సంగతి తెలిసిందే. తాజాగా యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీతో చంద్రబాబు సమావేశం అయ్యారు. తొలిసారిగా సోనియాతో చంద్రబాబు ముఖాముఖి భేటీ అయ్యారు. ప్రాంతీయ పార్టీల బలబలాలను సోనియాకు చంద్రబాబు వివరిస్తున్నట్లు సమాచారం.
లోక్‌సభ ఎన్నికల ఫలితాల అనంతర వ్యూహాలపై ఇరువురు నేతలు చర్చిస్తున్నారు. ఈ నెల 22వ తేదీన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులతో సోనియా సమావేశం కానున్నారు. 23వ తేదీన విపక్ష పార్టీల నాయకులతో సోనియా సమావేశమై లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై చర్చించనున్నారు.
హామీలను అమలు చేయకుండా వైసీపీ మాట మారుస్తోంది: లోకేశ్