తెలంగాణ మంత్రి కేటీఆర్ హైద్రాబాద్ ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీలో ప్రభుత్వ భూములపై సమీక్షా సమావేశం నిర్వహించారు. హైదరాబాద్‌లో ప్రభుత్వ భూముల రక్షణ చర్యలపై చర్చించారు. ప్రభుత్వ భూముల పరిరక్షణకు కఠిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా చూడాలని కేటీఆర్ అఃదికారులను ఆదేశించారు. ప్రభుత్వ స్థలాలకు జియో పెన్సింగ్, జీఐఎస్ మ్యాపింగ్ చేయాలని అధికారులకు సూచించారు. దశాబ్దాల కింద తీసుకున్న లీజ్‌లను సమీక్షించాలని మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు.