telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

11 కోట్లకు విరాటపర్వం డిజిటల్ హక్కులు…

Virataparvam

రానా దగ్గుపాటి ప్రస్తుతం విరాటపర్వం అనే సినిమాలో చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో రానాకు జంటగా సాయి పల్లవి చేస్తుంది. ఈ సినిమా ”నీదీ నాదీ ఒకే కథ” ఫేమ్ వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఇందోలో నటి ప్రియమణి కీలక పాత్ర పోషించనున్నారు. ఇక ఈ సినిమా 1990నాటి నక్సలిజం నేపథ్యంలో తెరకెక్కతోంది. ఈ సినిమాలో నక్సల్ నాయకుడు రవి అన్న పాత్రలో రానా కనిపించనున్నాడు. అయితే ఈ సినిమాలో మరో కీలక పాత్ర కోసం నివేత పేతురాజ్‌నటిస్తుంది. ఈ చిత్రం సురేష్ ప్రొడక్షన్స్ సురేష్ బాబు సమర్పణలో ఎస్ ఎల్ వీ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతోంది. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుందిఈ సినిమా హక్కుల కోసం నెట్‌ఫ్లిక్స్ దాదాపు రూ.11 కోట్లు చెల్లించిందని, అంతేకాకుండా సినిమా విడుదలైన 45 రోజుల తర్వాత ఓటీటీ రిలీజ్ ఉండేలా ఒప్పందం చేసుకున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ సినిమాపై అభిమానులు అంచనాలు బాగానే పెట్టుకున్నారు

Related posts