telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆడియో హల్చల్..ఓ యువకున్ని

సిద్దిపేట జిల్లా మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. తెలంగాణ ఉద్యమంలో జానపద కళాకారునిగా ఎంతో పేరుగాంచారు రసమయి. ఇక తెలంగాణ వచ్చాక టీఆర్ఎస్ లోకి వెళ్లి మానకొండూర్ ఎమ్మెల్యే టికెట్ పొంది రెండుసార్లు గెలుపొందారు. అయితే తాజాగా..వివాదంలో ఇరుక్కున్నారు ఎమ్మెల్యే రసమయి. ఓ యువకున్ని ఎమ్మెల్యే రసమయి తిడుతున్న.. ఆడియో సోషల్ మీడియాలో హల్చల్ అవుతోంది. దీంతో అడ్డంగా బుక్కయ్యారు. స్థానిక సమస్యలను సోషల్ మీడియాలో ప్రశ్నించినందుకు అసభ్యపదజాలంతో సదరు యువకుడిని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ దూషించారు. బెజ్జంకి మండలం బేగంపేట గ్రామానికి చెందిన సదరు యువకుడిని బెదిరింపులకు గురి చేశారు ఎమ్మెల్యే రసమయి. ఇంకోసారి నియోజకవర్గ సమస్యలపై సోషల్ మీడియాలో పెడితే అంతు చూస్తానని ఆగ్రహంతో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఊగిపోయారు. రసమయి బూతులు సరైన సమాధానమే చెప్పాడు ఆ యువకుడు. ఓ ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలా తిట్టడమేంటి అని ప్రశ్నించాడు. ఏది ఏమైనా ఎమ్మెల్యే రసమయికి ఈ వివాదం పెద్ద తలనొప్పిగా మారేలా ఉంది.

Related posts