telugu navyamedia
సినిమా వార్తలు

“జెర్సీ” తమిళ రీమేక్ లో త్రిష ?

trisha

గౌత‌మ్ తిన్న‌నూరి ద‌ర్శ‌క‌త్వంలో నాని న‌టించిన చిత్రం “జెర్సీ”. ఈ చిత్రానికి అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ ల‌భించింది. నాని క్రికెట‌ర్‌గా అద‌రగొట్టాడ‌ని సెలెబ్రిటీలు సైతం ప్రశంసల జల్లు కురిపించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రంలో శ్ర‌ద్ధా శ్రీనాథ్ కథానాయికగా న‌టించింది. జెర్సీ సినిమాలో నాని అర్జున్ అనే క్రికెటర్ పాత్రను పోషించాడు. 1996-97 రంజీట్రోఫీ క్రికెట్ నేపథ్యంలో ఈ చిత్ర కథ నడిచింది. విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్న ఈ చిత్రాన్ని ఇప్పుడు బాలీవుడ్, కోలీవుడ్‌లో రీమేక్ చేస్తున్నారు. స్టార్ హీరో షాహిద్ కపూర్ ఈ హిందీ రీమేక్ లో నటిస్తున్నారు. తమిళ్ రీమేక్ లో యంగ్ హీరో విష్ణు విశాల్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. అయితే విష్ణు విశాల్ కు జోడి ఎవరనే దానిపై రకరకాల వార్తలు వచ్చాయి. ముందుగా అమలాపాల్ పేరు వినిపించింది. తాజాగా స్టార్ హీరోయిన్ త్రిష ఈ రీమేక్ లో నటిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి.

Related posts