బాలీవుడ్ క్వీన్, ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ బాలీవుడ్ ప్రముఖులపై, నెపోటిజంపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య తర్వాత నెపోటిజంపై ఆమె చేసిన వ్యాఖ్యలు, కొందరు బాలీవుడ్ ప్రముఖులపై నేరుగా ఆమె చేసిన కామెంట్లు దేశ వ్యాప్తంగా చర్చకు దారితీశాయి. అయితే తనను అణగదొక్కేందుకు బాలీవుడ్ మాఫియా విశ్వ ప్రయత్నం చేస్తోందని కంగనా ఇటీవలే ఆరోపించిన ఈ ఫైర్ బ్రాండ్ మరో బాంబు పేల్చింది. నార్కోటిక్స్ బ్యూరో బాలీవుడ్ లో కానీ రక్త పరీక్షలు చేస్తే ఏ లిస్ట్ వ్యక్తులందరూ బయటపడతారని, స్వచ్ఛ భారత్ మిషన్‌లో భాగంగా కేంద్రం బాలీవుడ్‌ని క్లీన్ చేస్తే మంచిదని సైటర్ వేసింది. అంతేకాదు బాలీవుడ్ మాఫియాను కంట్రోల్ చేస్తే మంచిదని అభిప్రాయపడింది. ఇక ఇక సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో ఇప్పటికే సుశాంత్ గర్ల్‌ఫ్రెండ్ రియాచక్రవర్తికి, డ్రగ్ లింక్స్‌తో సంబంధాలున్నాయని ఈడీ తేల్చింది. దీన్ని నార్కోటిక్ కంట్రోల్ బోర్డుకు రిఫర్ చేసింది. రంగంలోకి దిగిన నార్కోటిక్స్ బ్యూరో రియాపై కేసు ఫైల్ చేసింది. రియా సోదరుడి పేరును కూడా లిస్టులో చేర్చింది.
previous post
పవన్, లోకేష్ ఓడిపోతారని ముందే తెలుసు… బండ్ల గణేష్ కామెంట్స్