ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒడిశాకు అవసరమైన సాయం అందజేస్తున్నామని తెలిపారు. పెను తుపాను ‘ఫణి’తో అతలాకుతలం అయిన ఒడిశాలో సాధారణ పరిస్థితులు తీసుకొచ్చేందుకు అన్నిరకాలగా ప్రయత్నిస్తున్నామని చెప్పారు.
ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ నుంచి 2,055 మంది సిబ్బంది, షిఫ్ట్ ఆపరేటర్లు, విద్యుత్ నిపుణులను ఒడిశాకు పంపామని పేర్కొన్నారు. వీరి సాయంతో ఒడిశాలో విద్యుత్ వసతిని త్వరితగతిన పునరుద్ధరించవచ్చని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు చంద్రబాబు ఈరోజు ట్వీట్ చేశారు.
తెలంగాణలో మహాకూటమి.. ఏపీలో ముసుగు కూటమి: వైసీపీ ఆరోపణ