telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

బీజేపీ కర్ణాటక వ్యూహం సత్ఫాలితాలు.. మరో రెండు రాష్ట్రాలపై ప్రయోగం..

against bjp trying to apply last weapon as mp resigns

బీజేపీ కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ కూటమిని గద్దె దించిన తర్వాత మరో రెండు రాష్ట్రాలు రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లపై కన్నేసింది. మధ్యప్రదేశ్ పరిస్థితులు కూడా కర్ణాటకలాగే ఉన్నాయి. అక్కడ మొత్తం 231 స్థానాల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్య చాలా తక్కువ వ్యత్యాసం ఉంది. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 114 స్థానాలు లభిస్తే, బీజేపీకి 108 సీట్లు వచ్చాయి. ఇక్కడ బీఎస్పీకి ఇద్దరు, సమాజ్‌వాదీ పార్టీకి ఒకరు, నలుగురు ఇండిపెండెంట్లు ఉండడంతో వారి డిమాండ్ ఇప్పుడు చాలా పెరిగిపోయింది. వీరిలో ఒక ఇండిపెండెంట్ ఎమ్మెల్యేకు మంత్రిమండలిలో చోటు కూడా దక్కింది. కర్ణాటకలో విజయం తర్వాత కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో బీజేపీ బాగా పట్టు పెంచుకుంటోంది. దాంతో కాంగ్రెస్.. ఈ రాష్ట్రాల్లో తమ ఎమ్మెల్యేలను కాపాడుకునే ప్రయత్నాలు ప్రారంభించింది.

బీజేపీకి రాజస్థాన్‌లో పరిస్థితులు మాత్రం కాస్త కష్టంగా ఉండనున్నాయి. ఎందుకంటే ఇక్కడ అధికార కాంగ్రెస్, బీజేపీ మధ్య సీట్ల తేడా చాలా ఎక్కువ. ఇక్కడ కాంగ్రెస్‌కు 112 స్థానాలుంటే, బీజేపీకి 72 సీట్లే ఉన్నాయి. ఈ తేడాను తగ్గించడానికి మిగతా పార్టీల ఎమ్మెల్యేలను బీజేపీ ప్రలోభపెట్టినా, అక్కడ ప్రభుత్వ ఏర్పాటు సాధ్యం కాదు. అంటే కాంగ్రెస్‌లో చీలిక రాకుండా బీజేపీ ఇక్కడ సీఎం కుర్చీని దక్కించుకోవడం కష్టం. మధ్యప్రదేశ్ విషయానికి వస్తే, ఇక్కడ కాంగ్రెస్‌లో చాలా గ్రూపులు ఉన్నట్టు చెబుతున్నారు. వాటిలో ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌, దిగ్విజయ్ సింగ్‌ వర్గాలు ఉన్నాయి. కమల్‌నాథ్ ఇప్పటికీ మధ్యప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. అక్కడ కాంగ్రెస్ పార్టీకి అధికారికంగా రాష్ట్ర అధ్యక్షుడు ఎవరూ లేరు.

ఆయా రాష్ట్రాలలో (రాజస్థాన్, మధ్యప్రదేశ్, పంజాబ్) కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు తీవ్రంగా ఉన్నాయి. ఛత్తీస్‌గఢ్‌లో రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్న భూపేష్ బఘేల్‌ను ముఖ్యమంత్రిగా చేశారు. చాలా నెలల తర్వాత కొత్త అధ్యక్షుడిని నియమించారు” అని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ సీనియర్ నేత అవినాశ్ బీబీసీతో అన్నారు. కానీ ఇప్పుడు బీజేపీ తన మొత్తం దృష్టిని మధ్యప్రదేశ్‌లో అధికారం చేజిక్కించుకోవడంపైనే పెట్టింది. దానికి కసరత్తులు కూడా ప్రారంభమయ్యాయి. ఎందుకంటే, మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ హఠాత్తుగా తన పాత ఫాంలోకి వచ్చేశారు.

Related posts