telugu navyamedia
సినిమా వార్తలు

బిగ్ బాస్ షోపై ఆసక్తికర కామెంట్స్..

బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న బిగ్‌ రియాల్టీ షో బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌ ప్రారంభం కానుంది. ఈ షోకు హోస్ట్‌గా వ్యవ‌హారిస్తున్న అక్కినేని నాగార్జున ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

స్టార్‌ మా యొక్క ప్రతిష్టాత్మక రియాల్టీ షో బిగ్‌ బాస్‌ ఐదవ సీజన్‌ గ్రాండ్‌ ప్రీమియర్‌ స్టార్‌ మా ఛానెల్‌పై సెప్టెంబర్‌ 05, సాయంత్రం 6 గంటలకు ప్రసారం కానుంది. అనంతరం 15 వారాల పాటు రాత్రి 10 గంటలకు సోమవారం–శుక్రవారం వరకూ మరియు రాత్రి 9 గంటలకు శని–ఆదివారాలలో ప్రసారమవుతుంది. భారతదేశంలో ఏడు భాషలలో 37 సీజన్‌లను పూర్తి చేసుకున్న ఈ షో ఎండెమోల్‌షైన్‌ గ్రూప్‌ సొంతం.

‘‘గత కొద్ది నెలలు ప్రతి ఒక్కరికీ సవాల్‌గా నిలిచాయి. ఈ షోతో మా అభిమానుల జీవితాలలో ఆనందం, ఉల్లాసం తిరిగి తీసుకురావాలనేది మా ప్రయత్నం. ఓ నటునిగా, పోటీదారుల వాస్తవ భావాలను వెలుపలికి తీసుకురావడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. దీనివల్ల కంటెస్టెంట్స్‌ను మరింతగా ప్రేక్షకులు అర్థం చేసుకోగలరు. కుటుంబంలోని ప్రతి ఒక్కరికీ వినోదాన్ని అందించే ఈ షోలో భాగం కావడం పట్ల నేను సంతోషంగా ఉన్నాను’’ అని అన్నారు.

బిగ్‌బాస్‌ తెలుగు మరో సీజన్‌ను మీముందుకు తీసుకువస్తునందుకు మేము చాలా సంతోషంగా ఉన్నాం. నేడు మా దగ్గర ఉన్న మోస్ట్ ఎంటర్టైనింగ్ షోలలో బిగ్‌ బాస్‌ ఒకటి. వీక్షకులకు 100 రోజులకు పైగా వినోదాన్ని ఇది అందిస్తుంది. ఈ గేమ్ షో అపూర్వ ఆదరణను సొంతం చేసుకుంది..’’ అని స్టార్‌ మా అధికార ప్రతినిధి అన్నారు. ఇక అక్కినేని నాగార్జున ఈ సీజన్‌కు హోస్ట్‌గా వ్యవహరిస్తుండటంతో పాటుగా డ్రామా, రొమాన్స్‌, యాక్షన్‌, వినోదంను కలిపి ఆకట్టుకునే టాస్క్‌లతో మొత్తం కుటుంబానికి సమగ్రమైన వినోదం అందించనున్నారు.

Nagarjuna's Bigg Boss Telugu Season 5 to premiere on September 5. Watch new promo - Television News

ఇక గత రెండు సీజన్లకు హోస్ట్‌గా వ్యవహరించిన నాగార్జుననే ఈ సీజన్‌కు కూడా హోస్ట్‌గా చేయనున్నాడు. సీజన్‌ 5కి సంబంధించి ప్రోమోలు కూడా ఇప్పటికే వచ్చేశాయి. గత సీజన్‌ గ్రాండ్‌ ఫైనల్‌ , భారతదేశంలో మరే రియాల్టీ షో కూడా సాధించలేనట్టి రీతిలో అత్యధిక వ్యూస్ రేటింగ్‌ను సాధించి రికార్డులను సృష్టించింది ఈ గేమ్ షో. ఆ రికార్డులను తిరగరాసే రీతిలో ఈ సారి బిగ్‌బాస్‌ షో ఉండనుందని స‌మాచారం. గత నాలుగు సీజన్స్‌ సూపర్‌ హిట్‌ అవ్వడంతో ఐదో సీజన్‌పై బిగ్ బాస్ అభిమానుల‌కు అభిమానుల‌కు భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

Related posts