telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

ఫ్యాన్స్ కు న్యూ ఇయర్ విషెస్ చెప్పిన స్టార్స్…

ప్రతి ఏడాది అభిమానులు తమ అభిమాన హీరోకు న్యూ ఇయర్ విష్ పెడుతుంటారు. ఈ ఏడాది తారలు కూడా తమ అభిమానులకు విషెస్ తెలిపారు. యంగ్ టైగర్ ఎన్‌టీఆర్ ఇటీవల అన్ని వేడుకలకు దూరంగా ఉండి. కనిపించకుండా అభిమానులను నిరాశ పరిచాడు. దాంత కొత్త సంవత్సరానికి కూడా ఎన్‌టీఆర్ సైలెంట్‌గా ఉంటాడని అనుకున్నారు. కానీ ఎన్‌టీఆర్ షాక్ ఇస్తూ ‘అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు’ అని ట్వీట్ చేశాడు. నందమూరి కుంటుంబంలో మరో నవతర నట వారసుడు కళ్యాణ్ రామ్ ‘మీకు, మీ కుటుంబ సభ్యలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు’ అని ట్వీట్ చేశాడు. నాచురల్ స్టార్ నాని కూడా తన అభిమానులకు ట్విటర్ ద్వారా విష్ చేశాడు. ‘నేటి నుంచి థియేటర్స్‌‌లో. హ్యాపీ న్యూ ఇయర్’ అని ట్వీట్ చేశాడు. వీరిలో కేవలం తెలుగు వారే కాదు తమిళ స్టార్ హీరో సూర్య కూడా తన అభిమానులకు విష్ చేశాడు. ‘2021ని అద్భుతంగా గడుపుదాం. మంచి ఆరోగ్యం, ఆనందం అందరికీ దక్కాల’ని ట్వీట్ చేశాడు. వీరిలో సూపర్ స్టార్ మహేష్ కూడా తన అభిమానులకు ట్విటర్‌లో న్యూఇయర్ విషెస్ తెలిపారు. ఈ ఏడాది ఎన్నో కష్టాలతో జరిగింది. ఇటువంటి ఛాలెంజింతగ్ పరిస్థితులతో కూడా యుద్దం చేశాం. ఈ ఏడాది ఎంతో కష్టతరంగా గడిచింది. అయినా ఎట్టకేలకు ఈ ఏడాది పూర్తి చేశాం. రేపు గొప్పగి ఉంటుందని ఆశిద్దాం. హ్యాపీ న్యూఇయర్ 2021’ అని తన అభిమానులకు శుభాకాంక్షలు తెలపాడు.

Related posts