telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ

ప్రధాని మోదీని కలిసిన తెలంగాణ సీఎం కేసీఆర్

ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఇవాళ ప్ర‌ధాని న‌రేంద్ర మోదీతో సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన ప‌లు అంశాల‌పై ప్రధాని మోదీతో చ‌ర్చించారు. దాదాపు 50 నిమిషాల పాటు కొన‌సాగిన స‌మావేశంలో 10 అంశాల‌ను కేసీఆర్ మోదీ దృష్టికి తీసుకెళ్లారు. ఐపీఎస్ క్యాడర్ రివ్యూ, రాష్ట్రంలో టెక్సటైల్ పార్క్ ఏర్పాటు, హైదరాబాద్-నాగపూర్ పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు, కొత్త జిల్లాల్లో నవోదయ విద్యాలయాల ఏర్పాటు చేయాల‌ని మోదీని సీఎం కేసీఆర్ కోరారు.

ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజనకు అదనపు నిధులు విడుద‌ల చేయాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం చేప‌ట్టాల‌న్నారు. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన మెరుగుపరచడం కోసం చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు. క‌రీంన‌గ‌ర్‌లో ట్రిపుల్ ఐటీ, హైద‌రాబాద్‌లో ఐఐఎంతో పాటు తెలంగాణ‌లో గిరిజ‌న విశ్వ‌విద్యాల‌యం ఏర్పాటు చేయాల‌ని సీఎం కేసీఆర్ కోరారు. ఈ ప్ర‌తిపాద‌న‌ల‌కు సంబంధించిన లేఖ‌ల‌ను మోదీకి అంద‌జేశారు.

Related posts