telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఆర్‌ఆర్‌ఆర్‌ తర్వాత రామ్‌ చరణ్ నెక్ట్స్‌ మూవీ ఇదే !

ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమాను ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కతుంది. ఇందులో రామ్‌చరణ్, యంగ్ టైగర్ ఎన్‌టీఆర్‌లు ప్రధాన పాత్రలు చేస్తున్నారు. ఈ సినిమాతో చెర్రీ కచ్చితంగా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు చేస్తారని అభిమానులు నమ్మకంగా ఉన్నారు. అయితే తాజాగా ఆర్ఆర్ఆర్ తరువాత రామ్‌చరణ్ ఎవరితో సినిమా చేస్తారని సందేహాలు వస్తున్నాయి. ఆర్ఆర్ఆర్ వంటి భారీ సినిమా తరువాత చేసే సినిమా చాలా జాగ్రత్తగా ఎంచుకోవాలి. కాబట్టి అందరూ రామ్‌చరణ్ ఎంచుకునే దర్శకునిపై దృష్టి పెట్టారు.  ఆర్‌ఆర్‌ఆర్‌  తర్వాత జెర్సీ డైరెక్టర్ గౌతమ్… రామ్ చరణ్ తో సినిమా చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఇటీవలే చెర్రీకి యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఓ కథను గౌతమ్ చెప్పాడట. చరణ్ సైతం దీనికి పచ్చజెండా ఊపాడట. సో… దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వచ్చే ఆస్కారం ఉందని అంటున్నారు. మరి ‘మళ్లీరావా’, ‘జెర్సీ’ వంటి సాఫ్ట్ అండ్ ఎమోషనల్ సబ్జెక్ట్స్ ను డీల్ చేసిన గౌతమ్… చెర్రీని యాక్షన్ హీరోగా ఎలా చూపిస్తాడో చూడాలి!

Related posts