telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

13 రోజుల వయసున్న పసివాడిపై తండ్రి దారుణం… రెండేళ్ల కొడుకుపై నింద

Baby

అమెరికాలోని మినియాపోలిస్‌కు చెందిన మైకేల్ ఆంథోనీ హెర్కెల్ అనే వ్యక్తి 13 రోజుల వయసున్న పసివాణ్ణి దారుణంగా కొట్టి, హింసించాడు. దీంతో ఆ పసికందు స్పృహ కోల్పోయాడు. చలనం కోల్పోయిన పసికందును చూసి భయపడిన మైకేల్… ఇలాంటి పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలి ? అని గూగుల్‌లో దాదాపు 80 నిమిషాల పాటు సెర్చ్ చేశాడు. ఆ తర్వాత అంబులెన్సుకు ఫోన్ చేసి, తన రెండేళ్ల కొడుకు పొరబాటున తన సోదరుడిని సోఫాలోంచి లాగి కింద పడేశాడని చెప్పాడు. వెంటనే అక్కడకు చేరుకున్న అంబులెన్సు ఆ పసికందును ఆస్పత్రికి తీసుకెళ్లింది. అక్కడ చికిత్స పొందుతున్న ఆ పసికందు రెండ్రోజుల తర్వాత మరణించాడు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు మైకేల్‌ను ప్రశ్నించగా.. డైపర్ మారుస్తుండగా పసివాడు కిందపడిపోయాడని చెప్పాడు. అయితే అతడిని అనుమానించిన పోలీసులు తమదైన స్టైల్ లో అడగడంతో అసలు విషయం వెలుగులోకి రావడంతో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. గతంలో కూడా మైకేల్ తన భార్యను తీవ్రంగా హింసించి, ఆమెను కలవద్దొన్న కోర్టు ఆదేశాన్ని ధిక్కరించి జైలుపాలయ్యాడు.

Related posts