telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

వివాదాస్పద యూట్యూబ్ స్టార్ ప్యూడీపీ సంచలన నిర్ణయం

Pewdiepie

వివాదాస్పద యూట్యూబ్ స్టార్ ప్యూడీపీ తాను యూట్యూబ్‌ వీడియో ప్లాట్‌ఫామ్ నుంచి తప్పుకుంటున్నట్టు తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నాడు. దీనికి కారణం తాను బాగా అలిసిపోవడమేనని చెప్పాడు. అందుకే యూట్యూబ్‌ నుంచి విరామం తీసుకుంటున్నట్లు తెలిపాడు. 2020 ఆరంభంలోనే యూట్యూబ్‌ నుంచి వైదొలుగుతానన్నాడు. యూట్యూబ్‌లో ప్యూడీపీగా పేరొందిన ఫెలిక్స్‌ అర్విడ్‌ జెల్‌బెర్గ్‌ స్వీడన్‌ దేశస్థుడు. ప్యూడీపీ అనూహ్య నిర్ణయంతో ఆయన ఫ్యాన్స్ తీవ్ర నిరాశ, నిస్పృహల్లో మునిగిపోయారు. యూట్యూబ్‌లో అతడికి ఏకంగా 102 మిలియన్ల సబ్‌స్ర్కైబర్లు ఉన్నారు. ప్యూడీపీ యూట్యూబ్‌లో పెట్టే వీడియోలకు నెలకు లక్షల పౌండ్ల ఆదాయం వస్తుంది. సోషల్ మీడియాలోనూ మనోడికి ఫాలోవర్లు బాగానే ఉన్నారు. ట్విట్టర్‌లో 18 మిలియన్ల ఫాలోవర్లు ఉంటే, ఇన్‌స్టాగ్రామ్‌లో 20 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. అంతేకాదు టైమ్‌ మ్యాగజైన్‌ ప్రకటించిన ప్రపంచంలో 100 మంది అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో కూడా ప్యూడీపీ చోటు దక్కించుకున్నాడు.

Related posts