telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ

కిడారి శ్రవణ్ కుమార్ రాజీనామాకి .. గవర్నర్ ఆమోదం..

governor accepted kidari sravan kumar resign

ఏపీ మంత్రి కిడారి శ్రవణ్ కుమార్, నిబంధనల ప్రకారం మంత్రి పదవి చేపట్టిన 6 నెలల లోపు ప్రజాప్రతినిధిగా ఎన్నిక కావాల్సి ఉండగా, ఈలోపే గడువు ముగియనున్న నేపథ్యంలో తన పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామా పత్రాన్ని గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఆమోదించారు. కిడారి ఇవాళ అమరావతిలో పార్టీ అధినాయకత్వంతో చర్చించిన తర్వాత తన రాజీనామా లేఖను సచివాలయంలో అందజేశారు. ఆ లేఖను సీఎంవో అధికారులు గవర్నర్ కు పంపగా ఆయన లాంఛనప్రాయంగా దానిపై ఆమోదముద్ర వేశారు.

గతేడాది నవంబర్ 11న కిడారి మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన తండ్రిని మావోలు బలిగొనడంతో టీడీపీ శ్రవణ్ ను ప్రోత్సహించే ఉద్దేశంతో మంత్రి పదవి ఇచ్చింది. అయితే, నిబంధనల ప్రకారం 6 నెలల లోపు ఎన్నికల బరిలో తనను తాను నిరూపించుకోవాల్సి ఉన్నా, మే 11తో ఆ గడువు పూర్తికానుంది. దాంతో, నిబంధనలు అనుసరించి శ్రవణ్ పదవికి రాజీనామా చేశారు.

Related posts