telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా ఆ మంత్రికి కరోనా…

Corona

మన దేశంలో ఈ ఏడాది నుండో కరోనా వ్యాక్సిన్ పంపిణి జరుగుతున్న కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి.  కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తగిన చర్యలు తీసుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సామాన్యులతో పాటుగా సెలెబ్రిటీలు, రాజకీయ నాయకులకు కూడా కరోనా సోకుతున్నది.  తాజాగా, గుజరాత్ క్రీడాశాఖ మంత్రి ఈశ్వర సింగ్ పటేల్ కరోనా బారిన పడ్డారు.  ఈనెల 13 వ తేదీన మంత్రి కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు.  కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తరువాత ఆయనకు కరోనా సోకింది.  వ్యాక్సిన్  తీసుకున్నాకూడా కరోనా గుజరాత్ ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది.  ప్రస్తుతం మంత్రి ఈశ్వర్ సింగ్ పటేల్ యూఎన్ మెహతా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.  వ్యాక్సిన్ తీసుకున్నా కరోనా నిబంధనలు పాటించాలని లేదంటే కరోనా బారిన పడక తప్పదని మరోసారి రుజువైంది.  అయితే గత నెలలో 10 వేలకు దిగ్గువగా నమోదైన రోజువారీ కరోనా కేసులు ఇప్పుడు 25 వేలకు పైగా నమోదవుతున్నాయి. కాబట్టి ప్రజలు అందరూ కరోనా నియమాలను తప్పకుండ పాటించాలని వైద్యాధికారులు చెబుతున్నారు.

Related posts