telugu navyamedia
సినిమా వార్తలు

దేవి శ్రీ ఇంట్లో విషాదం..

టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ ఇంట్లో వరుస విషాదాలు నెలకొన్నాయి. ఓ కుటుంబలో ఇద్ద‌రు మ‌ర‌ణించ‌డంతో దేవి ఇంట్లో విషాదఛాయలు నెలకొన్నాయి. దేవి శ్రీ ప్రసాద్ తండ్రి స‌త్య‌మూర్తి త‌మ్ముడు ( బాబాయి) బుల్గానిన్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఇక ఈ మ‌రణ వార్త విని బుల్గానిన్ సోదరి దేవీ శ్రీ ప్ర‌సాద్ మేన‌త్త సీతా మ‌హాల‌క్షి కూడా ప్రాణాలు కోల్పోయింది.

సోదరుడి హఠాన్మరణం జీర్నించుకోలేని దేవీ శ్రీ మేన‌త్త సీతా మ‌హాల‌క్షి గుండెపోటుతో మరణించింది. దీంతో బాబాయ్, మేనత్తలు ఒకేసారి ఆకస్మికంగా మృతి చెందడంతో దేవిశ్రీప్రసాద్ సహా ఆయన కుటుంబ సభ్యులు శోక సముద్రంలో మునిగిపోయారు. దేవిశ్రీ ఫ్యామిలిలో జరిగిన ఈ రెండు ఊహించని విషాదాలతో ఇండస్ట్రీలోని పలువురు సెలబ్రెటీలు సైతం సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

కాగా దేవిశ్రీ ప్రసాద్ స్వస్థలం తూర్పు గోదావరి జిల్లాలోని రామచంద్రాపురం దగ్గర వెదురుపాక. శాస్త్రీయ సంగీత నేపథ్యం ఉన్న కుటుంబం. ఆయన తాతగారు సత్యమూర్తి తండ్రి నారాయణ కమ్యూనిస్ట్ పార్టీలో లీడర్‌గా ఉన్నారు. ఆయనకి ముగ్గురు కొడుకులు , ముగ్గురు కూతుళ్ళు. మొత్తం ఆరుగురు సంతానం. రష్యన్ కమ్యూనిస్టు లీడర్ బుల్గానిన్ చనిపోయిన రోజే పుట్టడంతో.. ఆయన తండ్రి నారాయణ తన చిన్న కొడుకుకు బుల్గానిన్ అనే పేరు పెట్టారంట‌.
.

Related posts