telugu navyamedia
సినిమా వార్తలు

ఎన్టీఆర్, మహేష్ బాబులతో “కేజిఎఫ్” దర్శకుడి సినిమా లేదు…!

PRashanth-Neel-with-Mahesh-and-NTR

ఇటీవల విడుదలైన కన్నడ సినిమా “కేజిఎఫ్” సంచలన విజయాన్ని నమోదు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం కన్నడ భాషలోనే కాకుండా తెలుగు, హిందీ భాషల్లో కూడా మంచి ప్రేక్షకాదరణతోపాటు భారీ వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రానికి దర్శకత్వంలో వహించిన దర్శకుడు ప్రశాంత్ నీల్ పేరు ఒక్కసారిగా చిత్రపరిశ్రమలో మారుమ్రోగిపోయింది. దీంతో దర్శకుడు ప్రశాంత్ నీల్ తెలుగులో ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడని, ఎన్టీఆర్ కు ఆయనతో సినిమా చేయడానికి ఉత్సాహంగా ఉన్నాడని టాక్ వచ్చింది. అంతేకాదు ప్రశాంత్ నీల్ తో సినిమా చేయడానికి మహేష్ బాబు కబురంపారని, ఆల్రెడీ లైన్ విన్పించడం కదా జరిగిందని వార్తలు వచ్చాయి. కానీ ఈ రెండు వార్తల్లోనూ నిజం లేదనేది తాజా సమాచారం. అసలు ఎన్టీఆర్, మహేష్ బాబులను దర్శకుడు ప్రశాంత్ నీల్ కలవలేదట. వాళ్ళ దగ్గర నుంచి ఆయనకు ఎలాంటి కబురూ వెళ్లలేదట. ఎన్టీఆర్ ప్రస్తుతం “ఆర్ఆర్ఆర్” చిత్రంతో బిజీగా ఉన్నారు. ఇక మహేష్ బాబు “మహర్షి” సినిమా చిత్రీకరణలో ఉన్నారు. మరోవైపు ప్రశాంత్ నీల్ “కేజిఎఫ్ చాప్టర్-2” చిత్రాన్ని బాలీవుడ్ నటీనటులతో భారీ స్థాయిలో తెరపైకి తీసుకెళ్లే ప్రాణిలో ఉన్నారు.

Related posts