telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

డ్రైవర్ గేటప్ లో రకుల్

రకుల్ “వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్”తో తెలుగు వారికి దగ్గరైంది. ఆ తరువాత ‘లౌక్యం’, ‘నాన్నకు ప్రేమతో’, ‘ధృవ’ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది. అయితే ఈ మధ్య తాను నటించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టడంతో అవకాశాలు తగ్గాయి. ఇటీవల అజయ్ దేవ్‌గన్‌తో ‘దేదే ప్యార్ దే’ అనే సినిమా చేసింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బాగానే అదరగొట్టింది. కాగా అటు తమిళం, ఇటు తెలుగు నుంచి అవకాశాలు పెద్దగా లేకపోవడంతో రకుల్ ప్రస్తుతం బాలీవుడ్‌పై దృష్టి సారించింది. ఇక ఇటీవలె చెక్‌ మూవీతో టాలీవుడ్‌ లో సందడి చేసింది రకుల్‌. అయితే తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ కూడా ధైర్యంగా ట్రక్ నడిపేసింది. అయితే ఇది నిజంగా కాదు… సినిమా కోసం. ‘సర్దార్ కా గ్రాండ్ సన్’ బాలీవుడ్ సినిమాలో అర్జున్ కపూర్ తో కలసి నటిస్తోంది రకుల్. ఈ కామెడీ డ్రామాలో ఇంకా జాన్ అబ్రహామ్, అదితిరావ్ హైద్రీ, నీనా గుప్త ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. కాస్వీ నాయర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలోనే ఓ సీన్ లో భాగంగా రకుల్ ట్రక్ డైవింగ్ చేసిందట. ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ‘వ్యక్తిగతంగా నాకు డ్రైవింగ్ చేయటం ఎంతో ఇష్టం. అయితే ట్రక్ డ్రైవ్ చేయటం అంత ఈజీ కాదు. ఎంతో నేర్పరితనం ఉండాలి. ఎంతో ఎటెన్షన్ కావాలి. ఇది ఒక కొత్త అనుభవం’ అని చెప్పింది. 

Related posts