telugu navyamedia
సినిమా వార్తలు

హీరో మంచు విష్ణు కు గాయాలు..ఆయ‌నే కారణం అంటూ పోస్ట్‌

యంగ్‌ హీరో మంచు విష్ణు హీరోగా ఇషాన్‌ సూర్య దర్శకత్వంలో జిన్నా సినిమాలో న‌టిస్తున్నారు.అవా ఎంటర్‌టైన్‌మెంట్, 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ ఈ చిత్రాన్నినిర్మిస్తున్న ఈ చిత్రంలో సన్నీ లియోన్, పాయల్‌ రాజ్‌పుత్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. వచ్చే నెల అక్టోబర్ 5న ఈ చిత్రం విడుదల కానుంది.

ఈ సినిమా కోసం మంచు విష్ణు చాలా కష్టపడుతున్నట్లు తెలుస్తుంది. ఫైట్లు, పాటల మీద ప్రత్యేక దృష్టి పెట్టారు. ముఖ్యంగా ఒక్కో పాటను ఒక్కో స్టార్ కొరియోగ్రాఫర్ చేత స్టెప్పులు కంపోజ్ చేయిస్తున్నారు.

Vishnu Manchu injured

‘జిన్నా’లో ప్రభుదేవా ఒక సాంగ్ చేశారు. గణేష్ ఆచార్య మరో సాంగ్ చేశారు. ప్రేమ్ రక్షిత్ కూడా సాంగ్స్ చేస్తున్నారు.

తాజాగా ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొన్న విష్ణు గాయాలపాలయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోను ఆయన తన ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా షేర్‌ చేసుకున్నారు.

ఓ సాంగ్‌ షూటింగ్‌లో భాగంగా గాయం అయ్యిందని, కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ మాస్టర్ స్టెప్స్ వల్ల అయ్యిందని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం విష్ణు షేర్‌ చేసిన ఈ పోస్ట్‌ నెట్టింట చక్కర్లు కొడుతుంది.

 

Related posts