telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

పవన్ సినిమాపై క్లారిటీ ఇచ్చిన శృతి హాసన్

Shruthi-Hassan

పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘వకీల్‌ సాబ్‌’. పింక్‌ రీమేక్‌గా వస్తోన్న ఈ చిత్రానికి వేణు శ్రీరామ్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. దిల్‌ రాజు, బోనీ కపూర్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్‌ సంగీతమందిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌, ‘మగువా మగువా’ సాంగ్‌ సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచాయి. లాక్‌డౌన్‌ కారణంగా సినిమా షూటింగ్‌ వాయిదా పడగా… ఈ చిత్రానికి సంబంధించిన ఓ అప్‌డేట్‌ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రంలో కీలక పాత్రల కోసం అంజలి, నివేదా థామస్‌లను చిత్ర బృందం ఇప్పటికే ఎంపిక చేసింది. అయితే మరో కీలక పాత్రలో శృతిహాసన్‌ నటిస్తున్నట్లు సోషల్‌ మీడియాలో అనేక వార్తల వస్తున్నాయి. అయితే ఇటీవలే తన సోషల్‌ మీడియా వేదికగా అభిమానులు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా.. ప్రస్తుతం తను తెలుగులో క్రాక్‌ చిత్రంలో మాత్రమే నటిస్తున్నాని, ఏ రీమేక్‌ చిత్రంలో నటించడం లేదని పేర్కొంది. అంతేకాకుండా తనను ఎవరూ కూడా సంప్రదించలేదని తేల్చిచెప్పడంతో సోషల్‌ మీడియాలో వస్తున్న వార్తలకు ఫుల్‌స్టాప్‌ పడింది.

Related posts