telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఆర్ ఆర్ ఆర్ చిత్రం కథ చెప్పేసిన సుద్దాల అశోక్ తేజ

suddala

రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్ కాంబోలో తెరకెక్కుతున్న ఆర్ ఆర్ ఆర్ చిత్రం కథ ఏంటన్న దానిపై ఇప్పటికే రాజమౌళి కొంత క్లారిటీ ఇచ్చారు. స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న ఇద్దరు వీరులు, ఒకరితో ఒకరు సంబంధం లేని ఇద్దరు వ్యక్తులు, ఒకరికొకరు ఇన్స్పిరేషన్ అయి ఉంటే వాళ్ల మధ్య స్నేహం ఏర్పడి ఉంటే ఎలా ఉంటుందనే కోణంలో కంప్లీట్‌ ఫిక్షనల్‌గా ఈ సినిమా ఉండబోతుందని క్లారిటీ ఇచ్చారు రాజమౌళి. ఈ తరుణంలో ఆర్ ఆర్ ఆర్ చిత్రానికి కథానుగుణంగా మూడు పాటలను రాసిన ప్రముఖ సినీ గేయరచయిత సుద్దాల అశోక్ తేజ ఆర్ ఆర్ ఆర్ కథపై మరింత క్లారిటీ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ.. ఈ సినిమాలో నేను మూడు పాటలు రాశా.. రాజమౌళిగారు కీరవాణిగారు చాలా బాగా రాశావు అని పొగిడారు. అయితే రాజమౌళి గారు కథ చెప్పినప్పుడు ఒకే సమయంలో తెలంగాణ నుంచి కొమరం భీం, ఏపీ నుంచి సీతారామరాజు ఒకేసారి మిస్ అవుతారు. ఓ రెండేళ్లుపాటు ఇద్దరూ కనిపించరు. ఎటు వెళ్లారో ఎవరికీ తెలియదు. రెండేళ్ల తరువాత ఆ ఇద్దరూ వచ్చి.. ఆయన స్వాత్రంత్య్య పోరాటం బ్రిటీష్ దొరలపై చేస్తే.. ఇక్కడ కొమరం భీం నైజాం రాజు మీద పోరాటం చేస్తారు. ఆ రెండు సంవత్సరాల సమయంలో వాళ్ళిద్దరూ కలుసుకుని ఉంటే వాళ్లకు వచ్చిన అనుభవాలు ఏమై ఉంటే వాళ్లు పోరాటం చేయాలనే నిర్ణయానికి వచ్చారనే గొప్ప సృజనాత్మక ఆలోచన రాజమౌళి గారిది. ఆయన ఆలోచన నుంచి వచ్చిన కల్పితమే ‘ఆర్ఆర్ఆర్’ సినిమా కథ అని క్లారిటీ ఇచ్చారు.

 

Related posts