telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

స్టీల్‌ప్లాంట్‌ : కేంద్ర నిర్ణయంపై వైసీపీ కీలక వ్యాఖ్యలు

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ వ్యవహరంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌లో రాష్ట్రానికి ఈక్విటీ షేరు లేదని.. స్టీల్‌ ప్లాంట్‌లో 100 శాతం రాష్ట్రానికి పెట్టుబడులు ఉపసంహరిస్తున్నామని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు. మెరుగైన ఉత్పాదకత కోసమే స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ చేస్తున్నామని.. ప్రైవేటీకరణ ద్వారా ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి పెరుగుతుందని విశాఖ ఎంపీ సత్యనారాయణ అడిగిన ప్రశ్నకు నిర్మలాసీతారామన్‌ సమాధానం ఇచ్చారు. అయితే.. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై వైసీపీ స్పందించింది.   విశాఖ స్టీల్‌ ప్లాంట్‌పై తమ వైఖరి మారదని.. మా వంతు ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు బొత్స సత్యనారాయణ. ప్రైవేటీకరణ ఉపసంహరించుకోవాలని ప్రధానికి మా సీఎం ఇప్పటికే లేఖ రాశారని… మరి ప్రతిపక్ష టీడీపీ పార్టీ ఏం చేస్తుందని ప్రశ్నించారు. టీడీపీ హయాంలోనే ప్రైవేటీకరణకు అంకురార్పణ జరిగింది కాబట్టే చంద్రబాబు కిమ్మనడం లేదన్నారు. చంద్రబాబు ఎప్పుడైనా ఏ విషయమైనా స్పష్టంగా చెప్పారా ? అని నిలదీశారు. నోరెత్తితే బండారం బయటపడుతోందనే…విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో చంద్రబాబు సైలెంట్ అయ్యారని.. విశాఖ స్టీల్ ప్లాంటులో రాష్ట్ర ప్రభుత్వం వాటా లేదని కేంద్రం కూడా స్పష్టం చేసిందని గుర్తు చేశారు. కానీ కొందరు వైసీపీపై అనవసరంగా ఆరోపణలు చేస్తున్నారని ఫైర్‌ అయ్యారు. విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కుకు మేం కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు బొత్స సత్యనారాయణ.

Related posts