telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బిగ్ బాస్-4 హోస్ట్ ఆయనేనా ?

star maa promo on bigg boss 3

105 రోజుల బిగ్ బాస్ నాగార్జున హోస్ట్‌గా 17 మంది కంటెస్టెంట్స్‌తో జూలై 21 ప్రారంభమైన బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్‌ సీజన్ 3‌లో ఆదివారం నాడు విజేతను ప్రకటించారు. బిగ్‌బాస్‌ తెలుగు 3 టైటిల్‌ను సింగర్ రాహుల్‌ సిప్లిగంజ్‌ గెలుచుకున్నారు. అందులో భాగంగా మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా రాహుల్ రూ.50లక్షల నగదు బహుమతిని దానితో పాటు ఓ ట్రోఫీని అందుకున్న విషయం తెలిసిందే. ఈ సీజన్‌కు విజేతగా నిలిచిన రాహుల్ సిప్లిగంజ్‌కు మెగాస్టార్ చిరు టైటిల్‌ను అందజేశారు. అయితే బిగ్‌బాస్‌3 షో ముగిసి 24 గంటలు కూడా గడవకముందే.. అప్పుడే బిగ్‌బాస్‌4 చర్చ మొదలైంది. అంతేకాదు.. ఈ షోకు హోస్ట్‌గా ఎవరు వ్యవహరించబోతున్నారన్న దానిపై కూడా రూమర్స్ మొదలయ్యాయి. తాజాగా వస్తున్న సమాచారం మేరకు.. బిగ్‌బాస్4 సీజన్‌కు మెగాస్టార్ చిరంజీవి హోస్ట్‌గా వ్యవహరించనున్నారని ఊహాగానాలు మొదలయ్యాయి. మొదట బిగ్‌బాస్ షోకు ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరించగా.. రెండవ సీజన్‌కు నాచురల్ స్టార్ నాని హోస్ట్‌గా ఉన్నాడు. అయితే సీజన్‌4కు చిరు ఉండబోతున్నారన్న వార్తలు వైరల్‌గా మారాయి. ఈ సారి బిగ్‌బాస్ తెలుగు సీజన్ 4కి హోస్ట్‌గా మెగాస్టార్ చేస్తున్నారని.. అందుకే నిన్న జరిగిన సీజన్ 3 ఫైనల్‌కి చిరు వచ్చారంటూ సోషల్ మీడియాలో న్యూస్‌ హల్‌చల్ చేస్తున్నాయి. అయితే ఈ వార్తలపై అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటన వెలువడలేదు.

Related posts