telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మీరు అడుక్కుంటున్నా మీ పక్కన ఉండేది మీ కుక్కే : పూరి జగన్నాథ్

Puri

డైరెక్టర్ పూరీ జగన్నాథ్ వివిధ అంశాలపై తన అభిప్రాయాలను ‘పూరీ మ్యూజింగ్స్’ పేరుతో సోషల్ మీడియా ద్వారా పంచుకుంటున్నారు. తాజాగా “పెంపుడు జంతువులు” టాపిక్ విషయమై మాట్లాడారు. “నా చిన్నప్పడు మా అమ్మానాన్న మా ఇంట్లో పెరిగిన గేదెను సంతలో అమ్మేశారు. వారం రోజుల తర్వాత అది పదిహేను ఊళ్లు దాటి మా ఇంటికి వచ్చేసింది. మమ్మల్ని చూసి అది కన్నీళ్లు పెట్టుకుంది. మా అమ్మానాన్న దానిని చూసి ఏడ్చేశారు. మేం ఆ గేదెను డబ్బు కోసం అమ్మేశాం. ఎవరో దానిని ఎత్తుకుపోయారనుకుంది. తప్పించుకుని తన ఫ్యామిలీ కోసం వచ్చేసింది. అవి అంత ఎమోషనల్‌గా ఫీలవుతాయి. పెంపుడు జంతువుల వల్ల మనం చాలా నేర్చుకుంటాం. ఏదో ఒక పెంపుడు జంతువును పెంచుకోండి. మీ ఇంట్లో చిన్న పిల్లలుంటే తప్పనిసరిగా ఓ కుక్కను పెంచుకోండి. ఐదేళ్ల మీ పాప దానికి తల్లిగా మారుతుంది. మనుషులను పెంచుకుంటే వంద ఫిర్యాదులు చేస్తారు. పెంపుడు జంతువులకు ప్రేమించడం తప్ప ఇంకేం తెలీదు. మీ దగ్గర డబ్బు లేకపోతే అందరూ వదిలేస్తారేమో. కానీ మీరు రోడ్డు మీదకు వచ్చేసి అడుక్కుంటున్నా మీ పక్కన కూర్చునేది మీ కుక్కే” అంటూ పూరి చెప్పిన విషయాలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.

 

View this post on Instagram

 

‪👉 https://youtu.be/iBOH8I1-V8c @charmmekaur #PC

A post shared by Puri Connects (@puriconnects) on

Related posts