ప్రేమకు వయస్సుతో సంబంధం బాలీవుడ్ స్టార్ హీరో అర్జున్ కపూర్. అర్జున్ కపూర్.. తనకన్నా వయస్సులో 12 ఏళ్ళు పెద్దది అయిన ఫిట్నెస్ బ్యూటీ మలైకా అరోరాతో చాలా కాలం నుంచి రిలేషన్షిప్లో ఉంటున్నారు.
ఒకప్పుడు సీక్రెట్ గా ఉంచిన ఈ విషయాన్ని వీరు ఈ మధ్య బట్టబయలు చేశారు. తమకు సంబంధించిన ఫొటోలను సోషల్మీడియాలో పోస్ట్ చేయడంతో నెటిజన్లు వారిద్దరిని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.
ఆంటీతో డేటింగ్ చేస్తున్నావ్.. సిగ్గు లేదు అని కొందరు.. ఇంకా నీకు వేరే అమ్మాయి దొరకలేదా .. ఇద్దరు పిల్లల తల్లిని ప్రేమిస్తున్నావ్ అని మరికొందరు ట్రోల్స్ చేస్తున్నారు.
ఇక తాజాగా ఈ ట్రోల్స్ పై అర్జున్ కపూర్ కొద్దిగా ఘాటుగానే స్పందించాడు. ట్రోల్స్ పై అర్జున్ కపూర్ ప్రేమకు వయసుతో సంబంధం లేదని ..కామెంట్స్ చేసిన వారిలో సగం మంది ఫేక్.. వారి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదని ట్వీట్ చేశాడు.
నా గురించి మాట్లాడేవాళ్లే.. నేను కనిపించినప్పుడు సెల్ఫీలు దిగుతున్నారు. నా వ్యక్తిగత జీవితంలో నేను ఏదైనా చేస్తాను. అది నా హక్కు..నా పనికి గుర్తింపు లభిస్తే చాలు.. నా పర్సనల్ విషయాలు అనవసరం.. ఇక వయస్సును చూసి ప్రేమించాలి అనేది నా దృష్టిలో వెర్రితనం.. నచ్చిన వాళ్లతో కలిసి జీవించాలనుకోవడంలో తప్పు లేదు” అంటూ స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చాడు.
కేసీఆర్ మనసు బంగారం… ప్రకాష్ రాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు