telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ప్రేమకు వయస్సు సమస్యకాదు : నటుడు రాహుల్ దేవ్

rahuldev

రాహుల్ దేవ్ విలన్ పాత్రల్లో నటించి మెప్పించిన నటుడు. వయస్సులో తన కంటే 18 ఏళ్లు చిన్నదైన 33 ఏళ్ల నటి, మోడల్ ముగ్దా గాడ్సేతో ల డేటింగ్ లో ఉన్నారు. రెండు వైపులా కుటుంబ సభ్యులకు తమ ప్రేమ సమ్మతమేనని ఆయన చెప్పారు. రాహుల్ 1998 లో తన చిన్ననాటి స్నేహితురాలైన రైనాను 1998 లో పెళ్ళి చేసుకున్నారు. వీరికి సిద్ధార్ధ్ పుట్టాడు. భార్య రైనా 2009లో తన భార్య క్యాన్సర్‌తో మరణించిన తరవాత తాను కొడుకు సిద్ధాంత్‌ కోసం ఎక్కువ సమయం కేటాయించానని రాహుల్ వెల్లడించారు. కొన్ని రోజుల తరవాత స్నేహితుడి పెళ్లి వేడుకలో ముగ్ధా పరిచయమైందని, అప్పటి నుంచి తన జీవితంలో ఎన్నో మార్పులు వచ్చాయని తెలిపారు. మాది తొలి చూపులోనే కలిగిన ప్రేమకాదు. ముందు మేం స్నేహితులమయ్యాం. మాకు సంబంధించిన అన్ని వేడుకల్లో మేమిద్దం కలుసుకున్నాం. దీంతో మా మధ్య బంధం దృఢపడింది. ఆ తరవాత, మేమిద్దం తరుచూ కలుసుకునేవాళ్లం. అలా ప్రేమలో పడిపోయాం అని రాహుల్ వివరించారు. వీరిద్దిరి మధ్య వయస్సు తేడా 18 ఏళ్లు ఉంది. నెటిజన్లు వయస్సు తేడాపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. దీంతో రాహుల్ స్పందించారు. మా ఇద్దరిమధ్య వయస్సుతేడా పెద్ద సమస్యకాదు. మొదట మేమిద్దరం మంచి స్నేహితులం ఆ తర్వాత మా ఇద్దరిమధ్య ఇష్టం పుట్టింది. మా ప్రేమ విషయం రెండు కుటంబాలకు తెలుసు , నా కుమారుడికి సమ్మతమే.. మా ఇంట్లో మా నాన్నకంటే మా అమ్మ పదేళ్లు చిన్నది. నా విషయంలో 18 ఏళ్ల ఏజ్ గ్యాప్ పెద్ద సమస్య కాదని మనం సంతోషంగా ఉంటే వయసు తేడా సమస్యే కాదని రాహుల్ దేవ్ చెప్పుకొచ్చారు.

Related posts