telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఇక్కడుంది లవర్ బోయ్ కాదుబే.. ఆరడుగుల మిసైల్… “లాస్ట్ పెగ్” టీజర్

Last-Peg

భరత్ సాగర్, యశస్విని రవీంద్ర హీరో హీరోయిన్లుగా వినూత్న కాన్సెప్టుతో వస్తోన్న చిత్రం “లాస్ట్ పెగ్”. సంజయ్ వడత్ ఎస్ దర్శకత్వం వహిస్తున్నారు. భవస పందన ప్రొడక్షన్ ప్రైవేట్ లిమిటెడ్, బీఎండబ్ల్యూ బ్యానర్లపై రజత్ దుగోజి సలేంకి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. లోకేష్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ మూవీ మనిషి జీవితంలో జరిగే కాలానికి సంబంధించినది. నిజానికి ఇది కన్నడ మూవీ. తెలుగులోనూ విడుదల చేస్తున్నారు. కిందటేడాది మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇప్పుడు ఈ సినిమా యాక్షన్ టీజర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ‘‘నేను యాక్షన్ కంటే లవ్‌నే ప్రిఫర్ చేస్తాను. లవ్ వద్దు యాక్షనే కావాలంటే నేను రెడీ’’ అంటూ హీరో పవర్‌ఫుల్‌గా చెప్పే డైలాగుతో టీజర్ మొదలైంది. ‘కిట్టు భాయ్ అంటే ఎవడో పోటుగాడు అనుకున్నా.. వీడిని చూస్తుంటే లవర్ బోయ్‌లా ఉన్నాడు’ అని విలన్‌తో హీరో గురించి డైలాగ్ చెప్పించారు. ‘ఇక్కడుంది లవర్ బోయ్ కాదుబే.. ఆరడుగుల మిసైల్. చెప్పేది జాగ్రత్తగా విను.. ఒక్కసారి వెపన్ లోడ్ చేసి లాంచ్ చేస్తే ఎలా ఉంటుందో తెలుసా ఇంపాక్ట్’ అంటూ హీరో చెప్పే డైలాగ్ హైలైట్. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళ భాషల్లో విడుదల కానుంది. మీరు కూడా ఈ టీజర్ ను వీక్షించండి.

Related posts