telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“ది జోయా ఫ్యాక్టర్” ట్రైలర్

The-Zoya-Factor

అభిషేక్ శర్మ దర్శకత్వంలో సోనమ్‌కపూర్, దుల్కర్ సల్మాన్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న చిత్రం “ది జోయా ఫ్యాక్టర్”. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. 25 జూన్ 1983 కపిల్‌దేవ్ సారథ్యంలో టీమిండియా ప్రపంచకప్ ట్రోఫీ గెలిచిన రోజు. అదే రోజు జోయా (సోనమ్ కపూర్) జన్మిస్తుంది. అయితే క్రికెట్ కప్ గెలుచుకున్న ఘనత టీమిండియాకు దక్కకుండా జోయాకు దక్కుకుంది. జోయా దీంతో ఒక్కసారిగా ఫేమస్ అయిపోతుందంటూ ప్రారంభమయే ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. లవ్ లైఫ్, జాబ్ లైఫ్‌లో ఫెయిల్ అయిన జోయా జీవితంలోకి క్రికెటర్ నిఖిల్ ఖోడా (దుల్కర్ సల్మాన్) వస్తాడు. నిఖిల్ ఎంట్రీ తర్వాత జోయా జీవితం ఎలా మారిందనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ట్రైలర్‌లో సోనమ్, దుల్కర్ సల్మాన్‌ల మధ్య సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. మీరు కూడా ఈ ట్రైలర్ ను వీక్షించండి.

Related posts