telugu navyamedia
సినిమా వార్తలు

‘హరిహర వీరమల్లు’ రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది

పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ అభిమానులకు మరో స్పెషల్‌ సర్‌ప్రైజ్‌ వచ్చేసింది. ఆయన హీరోగా నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ నుంచి పుట్టినరోజు కానుక విడుదలైంది. పవన్‌ 50వ పుట్టినరోజుని పురస్కరించుకుని గురువారం మధ్యాహ్నం చిత్రబృందం ఈ సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. ‘హరిహర వీరమల్లు’ రిలీజ్‌ డేట్‌ అనౌన్స్‌ చేసింది. ఈ మేరకు వచ్చే ఏడాది వేసవి కానుకగా ఏప్రిల్‌ 29న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. పీరియాడికల్‌ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకి క్రిష్‌ దర్శకత్వం వహిస్తున్నారు.

ఇందులో పవన్‌ వజ్రాలదొంగ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. పవన్‌కు జోడీగా నిధి అగర్వాల్‌ అలరించనున్నారు. మొఘల్‌ సామ్రాజ్యం పాలన బ్యాక్‌డ్రాప్‌లో రూపుదిద్దుకోనున్న ఈ సినిమాలో ఔరంగజేబు చెల్లెలి పాత్రలో బాలీవుడ్‌ నటి జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ కనిపించనున్నారు. అలాగే, ఔరంగజేబు పాత్రలో అర్జున్‌ రాంపాల్‌ నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కీరవాణి ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. మెగా సూర్య ప్రొడెక్షన్స్‌ పతాకంపై ఈ సినిమా నిర్మితమవుతోంది. మరోవైపు ఇప్పటికే విడుదలైన ‘భీమ్లానాయక్‌’ ఫస్ట్‌ సింగిల్‌ విశేషంగా అలరిస్తోన్న విషయం తెలిసిందే.

Hari Hara Veeramallu update New release date on old poster

Related posts