ఏపీలో కాపు వర్గాల హక్కుల పరిరక్షణకు కార్పొరేషన్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. దీనికి తూర్పు గోదావరి జిల్లా రాజానగరం వైసీపీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజాకు బాధ్యతలు అప్పగించింది. ఏపీ కాపు కార్పొరేషన్ చైర్మన్ గా రాజాను ఎంపిక చేస్తూ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఇందుకు సంబంధించి త్వరలో అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి.
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పేరొందిన జక్కంపూడి రామ్మోహన్ తనయుడే రాజా. జగన్ కేబినెట్ లో రాజాకు స్థానం దక్కుతుందని భావించారు. సామాజిక సమీకరణాల నేపథ్యంలో ఆయనకు కేబినెట్ పదవి దక్కలేదు. ఈ క్రమంలోనే కాపు కార్పొరేషన్ చైర్మన్ గా రాజాను జగన్ నియమించినట్టు తెలుస్తుంది.
రాముడి బాటలోనే ఐదేళ్లు సుపరిపాలన: చంద్రబాబు