telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

వరుణ్ తేజ్ ను “హిట్లర్” అంటున్న నిహారిక… ఎందుకంటే ?

Varun

మెగా బ్ర‌ద‌ర్ నాగబాబు గారాల ప‌ట్టి నిహారిక తొలిసారి “ఒక మ‌న‌సు” చిత్రంతో వెండితెర అరంగ్రేటం చేసింది. మొదటి చిత్రమే ఈ ముద్దుగుమ్మకు నిరాశ‌ను మిగిల్చింది. ఈ సినిమాలో నీహారిక నటనపై విమర్శలు వచ్చాయి. దీంతో సినిమాలకు గ్యాప్ ఇచ్చి వెబ్ సిరీస్ చేసింది. ఆ వెబ్ సిరీస్ కు మంచి గుర్తింపు రావడంతో “హ్య‌పీ వెడ్డింగ్” అనే చిత్రంలో నటించింది నిహారిక‌. ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా కొట్టింది. ఇక ఇటీవల “సూర్య‌కాంతం” చిత్రంతో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రాగా… ఈ చిత్రం కూడా నీహారికను తీవ్రంగా నిరాశ పరిచింది. దీంతో ఈ బ్యూటీ నిర్మాతగా మారాలనుకుంటుంది అనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఇదిలా ఉండగా… నిహారిక‌ దీపావళి సందర్భంగా త‌న ట్విట్ట‌ర్ ద్వారా హిట్ల‌ర్ పిక్చ‌ర్ అని ఓ ఫోటో షేర్ చేసింది. ఆ ఫోటోలో చిరు కూతుళ్ళు శ్రీజ‌, సుస్మిత‌తో పాటు నిహారిక ఆమె కజిన్స్ ఉన్నారు. వారి వెనుక వ‌రుణ్ తేజ్ ఉన్నాడు. దీపావ‌ళి సంద‌ర్భంగా ఈ ఫోటో షేర్ చేయ‌గా, ఈ ఫోటోకి నిహారిక పెట్టిన హిట్ల‌ర్ పిక్చ‌ర్ అనే కామెంట్ చ‌ర్చ‌నీయాంశంగా మారింది. హిట్ల‌ర్ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి త‌న చెల్లెళ్ళ‌ని కంటికి రెప్ప‌లా ఎలా చూసుకుంటాడో, ఇక్క‌డ వ‌రుణ్ తేజ్ కూడా నిహారిక గ్యాంగ్‌కి అండ‌గా ఉంటున్నాడ‌ని త‌న కామెంట్ ద్వారా తెలిపింది. సైరా న‌ర‌సింహారెడ్డి చిత్రంలో చివ‌రిగా క‌నిపించిన నిహారిక ప్ర‌స్తుతం వెబ్ సిరీస్‌తో బిజీగా ఉంది.

Related posts