తెలంగాణ సీఎం కేసీఆర్ దివ్యాంగులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ ద్వారా అందించే సాయం పెంచారు. సాధారణ లబ్దిదారుల కంటే దివ్యాంగులకు 25శాతం అధిక సాయం అందనుంది. ఇక నుంచి దివ్యాంగులైన వధువులకు రూ.1,25,145 నగదు ఇస్తారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. కేంద్ర చట్టానికి లోబడి ఆర్థిక సాయం పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం ఈ తీసుకుంది. సాధారణ కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు రూ.1,00,116 అందిస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల్లో ఆదరణ పొందిన పథకం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్. రెండోసారి అధికారంలో వచ్చాక టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ పథకంలో అనేక మార్పులు చేసింది.
అనివార్య కారణాలతో 2వ పెళ్లి చేసుకంటున్న పేదింటి వధువులకు కూడా ఈ పథకాన్ని వర్తింపజేస్తూ సీఎం కేసీఆర్ ఇటీవలే నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా దివ్యాంగులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ ద్వారా అందించే సాయాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో అమలయ్యే సంక్షేమ పథకాలు, కాంట్రాక్టులు, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపు పథకాల్లో దివ్యాంగులకు 5శాతం అదనంగా రిజర్వేషన్ ప్రకటించిన కేసీఆర్ ప్రభుత్వం… పెళ్లి కానుకను కూడా పెంచడం పట్ల హర్షం వ్యక్తమవుతోంది. కులం, మతం అనే తేడా లేకుండా ప్రతి పేదింటి ఆడబిడ్డ పెళ్లి ఖర్చుల కోసం సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు అమలుచేస్తున్నారు. ఇప్పటివరకు ఈ పథకాల కింద రూ.1,00,116 చొప్పున ఆడబిడ్డ తల్లికి అందిస్తున్నారు.
టీడీపీ అధికారంలోకి వస్తే హైద్రాబాద్ కంటే అభివృద్ధి: నటి దివ్యవాణి