telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బాహుబలి-2 నా జీవితంలో మరచిపోలేని సినిమా : ప్రభాస్‌

bahubali

బాహుబలితో ప్రభాస్‌ జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. ‘బాహుబలి-2 ది కన్‌క్లూజన్’‌ సినిమా 2017 ఏప్రిల్‌ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నేటికి సరిగ్గా మూడేళ్లు పూర్తి అవుతోంది. ఈ నేపథ్యంలో యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ బాహుబలి చిత్ర బృందానికి, అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. తన జీవితంలో అతిపెద్ద సినిమా అని, ఎప్పటికీ గుర్తిండేపోయే మధుర జ్ఞాపకమని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ‘బాహుబలి-2 కేవలం సినిమా మాత్రమే కాదు. జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు పొందిన చిత్రం. నా జీవితంలో అతిపెద్ద సినిమా. నా అభిమానులకు బాహుబలి చిత్ర యూనటి్‌కు, అద్భుత చిత్రంగా తీర్చిదిద్దిన రాజమౌళికి రుణపడి ఉంటాను. బాహుబలి-2 పూర్తి అయి మూడు సంవత్సరాలు పూర్తి అవుతోంది. ఇంతటి గొప్ప చిత్రంలో నటించడం అదృష్టంగా భావిస్తున్నా.. మీ అందరి ప్రేమలకు కృతజ్ఞుడిని’. అంటూ షూటింగ్‌ సమయంలో రానా, రాజమౌళితో కలిసి ఉన్న ఓ స్టిల్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు.

Related posts