telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

త‌మిళ‌నాడులో ‘నార‌ప్ప‌’ షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ పూర్తి…

Narappa

శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో విక్టరీ వెంకటేశ్ హీరోగా రూపొందుతోన్న చిత్రం ‘నార‌ప్ప‌’. త‌మిళంలో ఘ‌న విజ‌యం సాధించిన ‘అసుర‌న్‌’కు ఇది రీమేక్‌. ఈ చిత్రంలో ప్రియ‌మ‌ణి, రెబా జాన్ హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. క‌లైపులి థాను, డి.సురేష్‌బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవ‌ల త‌మిళ‌నాడు తిరుచందూర్ తెరికాడులోని రెడ్ డెసర్ట్ ప్రాంతంలో కొన్ని యాక్ష‌న్ స‌న్నివేశాల‌తో పాటు కీల‌క సన్నివేశాల‌ను చిత్రీక‌రించారు. మంగ‌ళ‌వారం రాత్రికి ఈ సినిమా షెడ్యూల్ చిత్రీక‌ర‌ణను పూర్తి చేసుకుంది. ఎంటైర్ యూనిట్ హైద‌రాబాద్ చేరుకుందని స‌మాచారం. క‌రోనా వైర‌స్ కార‌ణంగా సినిమా షూటింగ్స్ అన్నీ ఆగిపోయాయి. ఈ నేప‌థ్యంలో నార‌ప్ప త‌దుప‌రి షెడ్యూల్‌ను క‌రోనా వైర‌స్ ప్ర‌భావం త‌గ్గిన త‌ర్వాతే స్టార్ట్ చేస్తార‌ట‌.

Related posts